Advertisementt

విజయ్ దేవరకొండ నిజంగా అంతపని చేశాడా?

Thu 27th Oct 2022 10:28 AM
malobika banerjee,vijay devarakonda  విజయ్ దేవరకొండ నిజంగా అంతపని చేశాడా?
Did Vijay Devarakonda insult Hindi? విజయ్ దేవరకొండ నిజంగా అంతపని చేశాడా?
Advertisement
Ads by CJ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన స్వయంకృషి తో, చిత్రసీమలో ఏ విధమైన సంబంధంలేకపోయినా చాలా తక్కువ సమయంలోనే పెద్ద నటునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండ తన వైవిధ్యభరితమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పెళ్లి చూపులు, గీత గోవిందం మరియు అర్జున్ రెడ్డి లో అతని నటనకి అందరూ బ్రహ్మరధం పట్టారు. ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ , విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా అమ్మాయిల కలల రాజకుమారుడు అయిపోయాడు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్, అతడి బాలీవుడ్ స్వప్నాన్ని సమూలంగా నాశనం చేసింది. ప్రస్తుతం అతను తన క్రొత్త చిత్రాలపై అత్యంత జాగురూకతతో అడుగులు వేస్తున్నాడు.

ఈ సమయంలో విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ భామ మాలోబిక బెనర్జీ సంచలన ఆరోపణలు చేసింది. విజయ్ దేవరకొండ తన మాతృభాష హిందీని అవహేళన చేసాడని, కానీ అదే విజయ్ దేవరకొండ హిందీ చిత్రంలో నటించాడని ఎకసెక్కాలు ఆడింది. మాలోబిక తన అనుభవాన్ని పంచుకుంటూ నీ వెనకాలే నడిచే.. అనే మ్యూజిక్ వీడియో కోసం నేను అతనితో షూటింగ్ చేస్తున్నప్పుడు, అతనికి హిందీ రాదు, నేను సాధారణంగా పనిచేసేటప్పుడు ఆ భాషలోనే మాట్లాడాను. మేము సినిమా చేస్తున్నప్పుడు నేను అతనితో హిందీలో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు విజయ్ నవ్వుతూ, ఎగతాళి చేసాడు, అతనికి భాష అర్థం కావడం లేదని మరియు అది హిబ్రూ లాగా ఉందని చెప్పాడు. నాతో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాడు. భాషను ఎగతాళి చేసిన తర్వాత, అతని రాబోయే హిందీ చిత్రం లైగర్  ప్రోమోను చూసి నేను షాక్ అయ్యాను.

ఇంకా ఆమె మాట్లాడుతూ అతను హిందీని ఎలా అవమానించాడనే దాని గురించి నేను ప్రజలకు చెప్పాలనుకున్నాను. ఒక హిందీ చిత్రం షూటింగ్ చేస్తున్నాడు కానీ సినిమా ప్రమోషన్ సమయంలో అతను నా ప్రియమైన మిత్రుడు కాబట్టి నేను అలా చేయలేదు. నేను కూడా అతనికి బాలీవుడ్‌కు స్వాగతం అని ఒక మెసేజ్ ని పంపాను మరియు లైగర్ పోస్టర్‌ను జోడించాను. ఆ సినిమా నిజానికి ఆయన రాసిన హిందీ డైలాగులన్ని లేవని నేను తెలుసుకున్నాను.

విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఆమే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరభాషల వాళ్ళు తెలుగు భాషని, తెలుగు మాట్లాడే వాళ్ళని ఏవిధంగా అవమానిస్తున్నారో ముందర అవలోకనచేసుకోమని సలహాలు ఇస్తున్నారు.

Did Vijay Devarakonda insult Hindi?:

Malobika Banerjee shocking comments on Vijay Devarakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ