Advertisementt

వారిద్దరిపై పూరి జగన్నాథ్ కేసు

Thu 27th Oct 2022 09:40 AM
puri jagannadh,police protection,liger movie  వారిద్దరిపై పూరి జగన్నాథ్ కేసు
Puri Jagannadh approaches cops over Liger controversy వారిద్దరిపై పూరి జగన్నాథ్ కేసు
Advertisement
Ads by CJ

లైగర్ సినిమా వలన భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్, ఈ విషయంలో పూరీని ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారు. లైగర్ నష్టాలు పూడ్చమని పూరి మీద ఒత్తిడి చెయ్యడమే కాకుండా.. పూరి, ఛార్మి ఇళ్ల ముట్టడికి ప్లాన్ చెయ్యగా.. పూరి జగన్నాథ్ తనని బెదిరిస్తున్న వరంగల్ శ్రీను, శోభన్ అనే ఇద్దరి డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఫోన్ కాల్స్ ని వరంగల్  శ్రీను, శోభన్ లు లీక్ చెయ్యడంతో.. పూరి సీరియస్ అయ్యాడు. మీరేం పీక్కుంటారో పీక్కోండి.. నేను సామరస్యంగా సమస్యని పరిష్కరించి నష్టాలు పూడుస్తాను అని చెప్పినా.. వినకుండా మీరు ఇలా చేస్తే ఇవ్వాల్సింది కూడా ఇవ్వను అంటూ పూరి మాస్ స్టయిల్లో ఇచ్చిన వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో లీకయ్యింది.

దానితో పూరి సీరియస్ అయ్యి వరంగల్ శ్రీను, శోభన్ లపై కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. వరంగల్ శ్రీను, శోభన్ ఇద్దరు కూడా తనని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా బెదిరిస్తున్నారు అంటూ.. పూరి కేసు పెట్టాడు. వారిద్దరి నుండి తమకు రక్షణ కల్పించాలి అని పూరి జగన్నాథ్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. వారు తన ఇంటిపై కూడా దాడి చేసే అవకాశం ఉంది అని ముందస్తుగానే ఈ విషయంలో పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు పూరి కేసులో పేర్కొన్నాడు..

Puri Jagannadh approaches cops over Liger controversy:

Puri Jagannadh seeks police protection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ