Advertisementt

వీరమల్లుగా ప్రతాపం చూపిస్తున్న పవన్

Fri 28th Oct 2022 06:00 PM
pawan kalyan,harihara veeramallu,bhavadeeyudu bhagat singh,janasena  వీరమల్లుగా ప్రతాపం చూపిస్తున్న పవన్
Pawan Kalyan starts Hari Hara Veera Mallu shoot వీరమల్లుగా ప్రతాపం చూపిస్తున్న పవన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తన రాబోయే చిత్రాలను శరవేగంగా పూర్తిచేసి అటుపై రాజకీయంగా అందరినీ చెడుగుడు ఆడదానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మరియు ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలపై దృష్టి సారించాడు. హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని సెట్ మీదకి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో హరిహర వీరమల్లు చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కొన్ని వారాల క్రితం చిత్ర నిర్మాతలు ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ నిర్వహించారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో సాగుతోంది. దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ మరియు ఇతర నటుల మీద పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. అందుకోసం అద్భుతమైన సెట్లను అందమైన రీతిలో అమర్చారు. ఈ చిత్రం మొఘల్ మరియు బ్రిటిష్ పాలకుల పాలన నేపథ్యంలో సాగుతుంది. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మొఘుల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రని పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నోరాహ్ ఫతేహి మరియు సోనాల్ చౌహన్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Pawan Kalyan starts Hari Hara Veera Mallu shoot:

Pawan Kalyan joins Hari Hara Veera Mallu Shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ