గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి అపోజిట్ రోల్ వేసి.. అద్భుతమైన నటనతో అదరగొట్టేసిన సత్య దేవ్ కి గాడ్ ఫాదర్ సక్సెస్ ఫుల్ జోష్ నిచ్చింది. గాడ్ ఫాదర్ లో జయదేవ్ గా ఆయన లుక్స్ కానివ్వండి, డైలాగ్స్, అలాగే చిరు ని ఢీ కొట్టే సీన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నిటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు గాడ్ ఫాదర్ లో అంతగా హైలెట్ అయిన పాత్ర సత్యదేవ్ దే. చిరు ని చూస్తే ఒరిజినల్ లూసిఫర్ హీరో మోహన్ లాల్, నయన్ ని చూస్తే మంజు వారియర్ గుర్తుకు వచ్చినా, సత్య దేవ్ ని చూస్తే మాత్రం వివేక్ ఒబెరాయ్ గుర్తురాలేదు.. అంతలా ఆ పాత్రలో సత్య దేవ్ జీవించారని ఆడియన్స్ మాత్రమే కాదు క్రిటిక్స్ కూడా అన్నారు.
అయితే ఇక్కడ ఇంతటి విజయాన్ని అందుకున్న సత్యదేవ్.. బాలీవుడ్ లో డెబ్యూ మూవీ తోనే డిసాస్టర్ చవి చూసాడు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రామ్ సేతులో సత్యదేవ్ ఫుల్ లెంగ్త్ ముఖ్య పాత్రలో నటించారు. నిన్న మంగళవారం విడుదలైన ఈ మూవీకి నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. పూర్ రివ్యూస్ వచ్చాయి. రామ్ సేతు లో సత్యదేవ్ పాత్రకి మంచి ప్రశంసలు వస్తున్నా.. సినిమా కొచ్చిన వీక్ టాక్ సత్య దేవ్ కి ప్రాబ్లెమ్ అయ్యేలా కనబడుతుంది. అంటే ఈ సినిమా క్లిక్ అయితే సత్యదేవ్ కి హిందీ నుండి మెండుగా అవకాశాలు వచ్చేవి. సత్యదేవ్ పాత్రకు మంచి మైలేజి వున్నా, ఆ పాత్రలో సత్యదేవ్ విశేషంగా రాణించినా, సినిమా ప్లాప్ అయ్యేసరికి సత్యదేవ్ కష్టం వృధా అయ్యింది. రామ్ సేతు సత్యదేవ్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటే.. ఈ మూవీ ఆయనకి ఇచ్చిన షాక్ మాములుగా లేదు.
అయినప్పటికీ అతని నటన ఆధారంగా బాలీవుడ్ లో మరిన్ని ఛాన్స్ లు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.