బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాల విషయం కన్నా ఆమె అందాల విషయమై ఎక్కువగా మీడియాలో నానుతుంది. జాన్వీ కపూర్ నటన కన్నా ఆమె గ్లామర్ గురించిన చర్చలే ఎక్కువగా జరుగుతాయి. ఈమధ్యన ఆమె నటించిన మిలి ప్రమోషన్స్, అలాగే దివాళి పార్టీలలో టూ మచ్ గ్లామర్ షో తో జాన్వీ కపూర్ హైలెట్ అయ్యింది. అయితే తాజాగా తాను బడా నిర్మాత బోణీ కపూర్ కూతుర్ని అనో, లేదంటే అతిలోక సుందరి శ్రీదేవి కూతుర్ని అనో అవకాశాలు ఇవ్వడం లేదు.. కేవలం పెరఫార్మెన్స్ ని బట్టే అవకాశాలు వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీ లో ఉండాలంటే ప్రతిభ ఉండాలి. లేదంటే సినిమా నేపథ్యం ఉన్న అమ్మాయి అని ఎవరూ ఎర్ర తివాచీలు పరచరు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది జాన్వీ కపూర్.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. సినిమాల్లో నిలబడాలంటే కష్టపడాలి. నటన బావుంటేనే అవకాశాలు వస్తాయి. సినిమా నేపధ్యం నుండి వచ్చానని మొదటి అవకాశం సులువుగా వచ్చింది. తర్వాత అవకాశం కూడా అలానే ఏదో వచ్చింది.. కానీ తర్వాత అవకాశం ప్రతిభ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. నా ప్రతిభని, నటనని చూసే అవకాశాలు వస్తున్నాయి. నేను స్టార్ హీరోయిన్ కూతురిని, బడా నిర్మాత కూతురిని అని నన్ను ఎవరూ సినిమాల్లోకి తీసుకోరు. కోట్లాదిరూపాయలు నష్టాలకి రెడీ అవరు. వాటిని భరించేందుకు నేను డబ్బున్న అమ్మాయిని కాదు, మా నాన్నా కాదు అంటూ జాన్వీ కపూర్ డబ్బు పాఠాలు నేర్పుతోంది.