Advertisementt

మహేష్ తో రాజమౌళి క్రేజీ యాక్షన్ సీన్స్

Wed 26th Oct 2022 10:50 AM
rajamouli,mahesh,ssmb29  మహేష్ తో రాజమౌళి క్రేజీ యాక్షన్ సీన్స్
Rajamouli to throttle Mahesh Babu to new heights మహేష్ తో రాజమౌళి క్రేజీ యాక్షన్ సీన్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఈ మధ్యనే సర్కారు వారి పాట చిత్రంతో అందరినీ అలరించాడు. ప్రస్తుతం అతని అభిమానులే కాక సినీ ప్రియుల దృష్టి అంతా మహేష్ బాబు రాజమౌళి తో చేయబోయే చిత్రం పైనే ఉంది. ఎప్పుడైతే రాజమౌళి, మహేష్ బాబు తో చిత్రం తన సినీ ప్రస్థానంలో అతి పెద్ద చిత్రం అని చెప్పాడో అప్పడినుండి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే, విదేశీ విలేకరులతో మాట్లాడుతూ ఎవరికీ తెలియని ఆంగ్ల పదాలను వాడుతూ.. అందరిని వాటి అర్థాలను వెదికే పనిలో పెట్టాడు.

రాజమౌళి ఈ చిత్రంలో మహేష్ బాబు తో ఎవరికీ నమ్మశక్యంకాని యాక్షన్ సీన్స్ చేయించబోతున్నాడట. మహేష్ బాబు పాత్ర మునుపెన్నడూ లేని విధంగా మలుస్తూ ఎన్నో ఏక్షన్ సన్నివేశాలను సిద్ధం చేస్తున్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్ఛే సన్నివేశంలో, మహేష్ బాబు ఒక గుహలో నరమాంస భక్షకులతో చేసే పోరాట దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడుస్తాయని తెలుస్తోంది.

ఇవే కాకుండా ఇలాంటివి ఎన్నో మహేష్ కథలో రాజమౌళి రాస్తున్నాడని తెలుస్తోంది. రాజమౌళి ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన దీపికా పాడుకొనే ని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఈ చిత్రకథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాడనున్నది మరియు రాజమౌళి నిజజీవిత సన్నివేశాలను, భావోద్వేగాలను ఇందులో మిళితం చేయబోతున్నాడని టాక్ ఉంది.

Rajamouli to throttle Mahesh Babu to new heights:

Rajamouli sensational action block on Mahesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ