జన సేనాని పవన్ కళ్యాణ్ ఉగ్రరూపంతో, అటుపై చంద్ర బాబు పవన్ కళ్యాణ్ భేటీతో జగన్ మోహన్ రెడ్డి వెన్నులో వణుకు ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే, అతను , అతని మంత్రులు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు పై విషం చిమ్మడం ప్రారంభించారు. దీంట్లోకి బాలకృష్ణ మరియు చిరంజీవి చిత్రాల పై కులం పేరుతొ కుటిల రాజకీయాలకి తెరతీశారు. దానికి సంబంధించిందే, చంద్ర బాబు తనయుడు లోకేష్ సామజిక మాధ్యమాన్ని హ్యాక్ చేసి, చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల కి కులం రంగు పులుముతూ కుల విద్వేశాలు సృష్టించడానికి సిద్ధమయ్యారు.
లోకేష్ పేరుతొ పంపించిన మెసెజ్ లో, బాలకృష్ణ నరసింహ నాయుడు లో నాయుడు గా కనపడితే, చిరంజీవి మృగరాజు లో ఒక ఎస్.టి వేటగాని వలె నిమ్నకులస్తుని పాత్ర పోషించగా, బాలకృష్ణ విజయం సాధించాడని వివరించారు. అలానే లక్ష్మినరసింహ లో బాలకృష్ణ చౌదరి గా నటిస్తే, అంజి లో చిరంజీవి ఎస్.టి గా నటించాడని, మరో మారు బాలకృష్ణ విజయం సాధించాడని వివరించారు. అలానే బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి లో చౌదరి గా నటిస్తే, చిరంజీవి ఖైదీ నంబర్ 150 లో బీసీ/ కాపు పాత్రలో నటించి మరోమారు పరాజయం పొందాడని, ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ వీర సింహా రెడ్డి లో రెడ్డి పాత్ర చేతిలో చిరంజీవి వాల్తేర్ వీరయ్య బి.సి./ కాపు జాలరి గా పరాజయం పొందుతాడని ఉన్నది.
లోకేష్ దీని పై ప్రజలని అప్రమత్తంగా ఉండాలని కోరుతూ నకిలీ ఖాతాల నుండి నకిలీ ట్వీట్లు కులాలు మరియు మతాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించే లక్ష్యంతో ప్యాలెస్ క్యాట్ హస్తకళ. ఇలాంటి ఉచ్చులలో పడవద్దని ప్రజలను కోరుతున్నాను.. అంటూ ట్వీట్ చేసాడు.