హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లోని DAV స్కూల్ లో నాలుగేళ్ళ LKG పాపని DAV స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ అఘాయిత్యం చేయడంపై పేరెంట్స్ భగ్గుమన్నారు. పేరెంట్స్ ఆందోళన క్రమంలో పోలీస్ లు DAV స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపగా.. ఈ అఘాయిత్యంపై నోరు మెదపని స్కూల్ ప్రిన్సిపాల్ ని కూడా అరెస్ట్ చేసారు. అయితే ఈ అఘాయిత్యంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉండడమే కాదు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి DAV స్కూల్ అనుమతులు రద్దు చేసింది. అయితే ఈ ఘటనపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు.
చిరు సోషల్ ఇండియాలో ట్వీట్ చేస్తూ.. నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన అత్యాచారం,అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది.
ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను...అంటూ ఆవేదన వ్యక్తం చేసారు మెగాస్టార్ చిరంజీవి.