కొంతమంది హీరోలు ఈగోలకి పోయి తమ సినిమాల విడుదల విషయంలో ఎంత కాంపిటీషన్ అయినా అదే డేట్ కి రిలీజ్ చెయ్యాలని, రావాలని పట్టుబడతారు. ఇంతకుముందు ఇలాంటి కాంపిటీషన్ దసరా టైం లో చిరు-నాగ్ లు మధ్యలో కనిపించింది. దసరా కదా రెండు సినిమాలు డిఫరెంట్ కాన్సప్ట్స్ తో వస్తున్నాయి.. రెండు హిట్ అవుతాయనుకుంటే.. అందులో గాడ్ ఫాదర్ గట్టెక్కింది, నాగార్జున ఘోస్ట్ న్యూస్ లోనే లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే బిగ్ పోటీ సంక్రాంతి టైం లో కనబడనుంది. ఫెస్టివల్ అంటే చాలామంది హీరోలు పోటీ పడతారు. ఇందులో పెద్ద విచిత్రం ఏం లేదు. అలానే ఈ ఫెస్టివల్ కి చిరు-బాలయ్య ఉన్నారు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే మెగాస్టార్ చిరు-బాలకృష్ణలు సంక్రాంతి పోటీకి సై అన్నారు.. అబ్బో ఇది ఫాన్స్ మధ్యన క్రేజీ పోటీనే. కానీ ఈ ఇద్దరి హీరోల వలన నిర్మాతలు నలిగిపోవడం ఖాయం.
వాల్తేర్ వీరయ్య, వీర సింహ రెడ్డి కి నిర్మాతలు వేరు కూడా కాదు. ఒకే నిర్మాత. మైత్రి మూవీస్ వారే చిరు వాల్తేర్ వీరయ్య, బాలయ్య వీర సింహ రెడ్డికి నిర్మాతలు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే వాల్తేర్ వీరయ్య దర్శకుడు బాబీ, బాలయ్య వీర సింహ రెడ్డి గోపీచంద్ మలినేని లు ఇద్దరూ మైత్రి మూవీస్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య vs చిరు అనగానే.. ముందుగా ఫాన్స్ గోల ఏమోకానీ నిర్మాతలు మాత్రం ఇరుకున పడ్డారు. అటు ఇద్దరూ ఈగోలకి పోయి రిలీజ్ డేట్స్ విషయంలో వెనక్కి తగ్గము అంటే.. నిర్మాతలకు మూడిందే.