కొద్ది రోజులుగా సమంత మీడియాకి కానీ, సోషల్ మీడియాకి కానీ కనిపించకుండా మొహం చాటేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత కొన్నాళ్లుగా ఏ ప్రోగ్రాంలో కనిపించడం కానీ, షూటింగ్ లకి హాజరవడం కానీ చెయ్యడం లేదు. అయితే సమంత ఏదో స్కిన్ డిసీజ్ వలన ఇబ్బంది పడుతూ విదేశాల్లో చికిత్స చేయించుకుంటుంది అనే ప్రచారం జరగగా.. దివాళి రోజున సమంత రీసెంట్ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత లేటెస్ట్ పిక్స్ చూస్తే మతిపోతుంది. అంటే గ్లామర్ పరంగా సామ్ ఎప్పుడో హద్దులు చెరిపేసింది.
కానీ ఇప్పుడు సమంత లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆమె ఒళ్ళు చేసిందో, లేదంటే మరేదైనా ప్రాబ్లమో కానీ సమంత కొత్తగా కాస్త బొద్దుగా కనిపించింది. ఫేస్ లో గ్లో కనిపించినా.. ఆమె మొహం ఉబ్బినట్లుగా, సమంత బరువు పెరిగినట్లుగా అనిపిస్తుంది. సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకున్న సమంత మళ్ళీ ఇలా సరికొత్త అవతారంలో కనిపించింది. ఆమె ఒక యాడ్ షూట్ లో పాల్గొన్న పిక్స్ అవి, గ్లామర్ గానే కనిపించినా.. ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే సమంతలో స్పష్టంగా కనబడుతుంది. ఇక సమంత నటించిన యశోద నవంబర్ లో విడుదలవుతుండగా.. శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.