Advertisementt

జబర్దస్త్ నుండి నాకు సపోర్ట్ లేదు

Tue 25th Oct 2022 10:17 AM
chanti,jabardasth,bigg boss  జబర్దస్త్ నుండి నాకు సపోర్ట్ లేదు
I have no support from Jabardasth: Chanti జబర్దస్త్ నుండి నాకు సపోర్ట్ లేదు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన వారికి జబర్దస్త్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండదు అంటూ గతంలో కిర్రాక్ ఆర్పీ పలు సంచలన విషయాలను బయటపెట్టగా.. వాటిని డిఫెండ్ చేసుకోవడానికి హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళే కాదు, చాలామంది జబర్దస్త్ ఆర్టిస్ట్ లు నానా కష్టాలు పడ్డారు. ఇక అవినాష్ జబర్దస్త్ వదిలి బిగ్ బాస్ కి వెళ్ళినా అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా జబర్దస్త్ వాళ్ళు అతనికి మద్దతు ఇవ్వలేదు. ఇక ఈ సీజన్ లోకి చంటి, ఫైమా లు వచ్చారు. ఫైమా టాస్క్ పరంగా చించేస్తుంది. కానీ చంటి మాత్రం ఐదు వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. అయితే చంటి బిగ్ బాస్ లో ఉండగా.. తనకి జబర్దస్త్ నుండి ఎలాంటి సపోర్ట్ లేని కారణంగానే ఎలిమినేట్ అయ్యా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

నేను 10 ఏళ్లుగా జబర్దస్త్ లో ఉన్నా, సీనియర్.. అయినా నా అనుకున్న వాళ్ళు నన్ను బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు సపోర్ట్ చెయ్యలేదు. జబర్దస్త్ వాళ్ళు అస్సలు సపోర్ట్ చెయ్యలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇక గెటప్ శ్రీను మీకు సపోర్ట్ చేసాడు అనగానే.. ఎవరో ఒకరు మాత్రమే ఇలా చేసారు. కానీ నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేసారు అంటూ చంటి.. తనకి ప్రస్తుతం జబర్దస్త్ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు అంటూ కుండబద్దలు కొట్టేసాడు.

I have no support from Jabardasth: Chanti:

Chanti sensational comments on Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ