Advertisementt

బిగ్ బాస్ 6: రేవంత్ vs గీతు

Mon 24th Oct 2022 08:58 PM
bigg boss 6,geetu,revanth  బిగ్ బాస్ 6: రేవంత్ vs గీతు
Bigg Boss 6: Geetu vs Revanth బిగ్ బాస్ 6: రేవంత్ vs గీతు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఎనిమిదో వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు ఓ రేంజ్ లో జరిగాయి. గత రాత్రి దివాళి సెలెబ్రేషన్స్ లో హైపర్ ఆది సిల్లీ రీజన్స్ తో నామినేట్ చెయ్యకండి, చూడడానికి చిరాగ్గా ఉంది. ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అంటూ నామినేషన్స్ చెయ్యకండి, ప్రోపర్ రీజన్ తో నామినేషన్స్ చెయ్యండి అంటూ చెప్పడంతో.. ఈ రోజు నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ నానా రచ్చ చేసారు. ముఖ్యంగా రేవంత్ కి గీతు కి మధ్యన టగ్ ఆఫ్ వార్ మాములుగా జరగలేదు. రేవంత్ నా సెకండ్ నామినేషన్ గీతు అని.. చెప్పడానికి ఏం లేదు గీతు అనగానే ఎందుకు నామినేట్ చేసావ్ అంది. దానితో రేవంత్ నీ వెటకారం వేరే వాళ్ళ దగ్గర చూపించుకో అన్నాడు. 

తర్వాత గీతు రేవంత్ నువ్వు రూల్స్ పాటించావా, హౌస్ లో కుక్కలు మొరిగి చాలా వెళ్లిపోయాయి అంది. నువ్వు రూల్స్ పాటించావా అంటే నువ్ రూల్స్ పాటించావా అంటూ గొడవైంది. నువ్వెందులో గొప్పకాదు, ముందు తగ్గించుకో అన్నాడు రేవంత్. నేను గొప్పే అంది గీతు. నా ముందు నువ్వు నథింగ్ అంటే నువ్వు నథింగ్ అంటూ ఓ రేంజ్ లో ఇద్దరి మధ్యన ఫైట్ జరిగింది. ఒకవేలు నాకు చూపిస్తే మిగతా వేళ్ళు నిన్ను చూపిస్తాయి అనగానే, ఎక్కడా తగ్గకుండా నా ఐదు వేళ్ళు నిన్నే చూపిస్తాయి అంది గీతు. దానికి రేవంత్ అయితే నన్నేం పీకలేవ్ అన్నాడు. రేవంత్ మరోపక్క కీర్తి తోనూ గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Bigg Boss 6: Geetu vs Revanth :

Bigg Boss 6: 8th week nominations promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ