Advertisementt

గాడ్ ఫాదర్ కన్నా వాల్తేర్ వీరయ్య బెటర్

Mon 24th Oct 2022 08:18 PM
waltair veerayya movie,chiranjeevi,godfather movie  గాడ్ ఫాదర్ కన్నా వాల్తేర్ వీరయ్య బెటర్
Waltair Veerayya is better than Godfather గాడ్ ఫాదర్ కన్నా వాల్తేర్ వీరయ్య బెటర్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో కమ్ బ్యాక్ అయినా.. చిరు లో మునుపటి గ్రేస్ మిస్ అయ్యింది అనే కంప్లైంట్ ప్రేక్షకులనుండే కాదు, మెగా ఫాన్స్ నుండి కూడా వచ్చింది. మెగాస్టార్ ఫేస్ లో ఎక్సప్రెషన్స్ మిస్ అయ్యాయి.. ఇలాంటివి వినిపించాయి. రీసెంట్ గా గాడ్ ఫాదర్ లోను చిరు గాడ్ ఫాదర్ పాత్రలో లుక్స్ వైస్ గా అంతగా నచ్చలేదు. ఒకే రకమయిన ఎక్సప్రెషన్ మెయింటింగ్ చెయ్యడానికి చిరు ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. అయితే గాడ్ ఫాదర్ కన్నా, చిరు ఇప్పుడు వాల్తేర్ వీరయ్యలో లుక్ వైజ్ గా అదరగొట్టేసారు. 

ఆ బాడీ లాంగ్వేజ్, ఆ లుక్, ఫేస్ లో యంగ్ లుక్ ఛాయలు అన్ని కలిపి వాల్తేర్ వీరయ్యలో చిరు కొత్తగా కనిపించారు. అచ్చం ముఠా మేస్త్రీలో చిరు ఎంత రఫ్ గా ఉన్నారో ఇప్పుడు వాల్తేర్ వీరయ్య లోను అలాగే రఫ్ గా ఉన్నారు. మాస్ కి పూనకాలు తెప్పించడమే కాదు సాధారణ ప్రేక్షకుడు కూడా చిరంజీవి లుక్ చూసి ఇంప్రెస్స్ అవుతున్నారు. గాడ్ ఫాదర్ లో చిరు ని చూడలేకపోయాం.. కానీ వాల్తేర్ వీరయ్య టీజర్ లో చిరంజీవి ఇరగ్గొట్టేసారు అంటున్నారు.

Waltair Veerayya is better than Godfather:

Waltair Veerayya title teaser unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ