Advertisementt

వీర సింహా రెడ్డిగా విరాట్ ఉగ్ర రూపం

Wed 26th Oct 2022 10:43 PM
virat kohli,veera simha reddy  వీర సింహా రెడ్డిగా విరాట్ ఉగ్ర రూపం
Virat Kohli as NBK Veera Simha Reddy వీర సింహా రెడ్డిగా విరాట్ ఉగ్ర రూపం
Advertisement
Ads by CJ

టీ 20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది. భారత జట్టు నిన్న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఉత్కంఠభరిత పోటీలో సంచలన విజయం సాధించింది. పరుగుల లేమి తో బాధపడుతున్న టీం ఇండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఒక్కసారిగా జూలు విదిల్చి చెలరేగి ఆడుతూ పాకిస్తాన్ పాలిట సింహ స్వప్నం అవడంతో ఓటమి అంచులలో ఉన్న భారత్ అనూహ్యంగా విజయం సాధించింది.

భారత్ అభిమానులు ఒక రోజు ముందే దీపావళి టపాకాయలు కోహ్లీ సిక్సలు మరియు ఫోర్ల  రూపంలో పేల్చడంలో, వారి ఆనందానికి అవధులులేకుండా పోయింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ పై సామాజికమాధ్యమాలలో ప్రశంసలజల్లులు కురుస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్, అందరినీ వశ్చర్యపరుస్తూ విరాట్ కోహ్లీ ని నటసింహ బాలకృష్ణ రాబోయే చిత్రం వీర సింహ రెడ్డిగా మారుస్తూ ఉత్తేజకరమైన పోస్టర్ విడుదల చేయడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

బాలకృష్ణ స్థానంలో విరాట్ కోహ్లీ ని చూపిస్తూ వీర సింహ రెడ్డి ని విరాట్ సింహా రెడ్డి గా చూపిస్తూ కోహ్లీ సాధించిన 82(53) ని సూచిస్తూ, మైల్ స్టోన్ మీద కింగ్ అని రాయడంతో, క్రికెట్ అభిమానులు ఆనందపడుతున్నారు. కోహ్లీ మరిన్ని సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడి  భారత జట్టుకు ప్రపంచ కప్ ను తీసుకురావాలని కోరుకుంటున్నారు.

Virat Kohli as NBK Veera Simha Reddy:

Star Sports Channel is portrayed Virat Kohli as Veera Simha Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ