బిగ్ బాస్ సీజన్ 6 లో ఏడో వారం ముగిసి ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయ్యారు హౌస్ మేట్స్. ఏడో వారంలో అనూహ్య రీతిలో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. అర్జున్ కళ్యాణ్ ఓటింగ్ లో సేఫ్ అయినప్పటికీ.. ఎందుకో ఏమో.. అర్జున్ కళ్యాణ్ ని ఎలిమినేట్ చేసారు. అయితే అర్జున్ కళ్యాణ్ కాకుండా మరీనా ఎలిమినేట్ అవ్వాల్సింది. ఎందుకంటే ఓటింగ్ లో మరీనాకి తక్కువ ఓట్స్ పడుతున్నాయి. అలాగే హౌస్ లోను మరీనా టాస్క్ పెరఫార్మెన్స్ లోనూ వీక్ గా ఉంటుంది. కానీ మరీనాని కాపాడింది మాత్రం ఆమె తన హస్బెండ్ రోహిత్ తో కలిసి రావడమే. రోహిత్ తో రొమాన్స్ అంటూ మరీనా ఈ వారం ఎలిమినేషన్ నుండి బయటపడినట్లుగా తెలుస్తుంది.
ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ కూడా లీకైంది. గత రాత్రే బిగ్ బాస్ ఎనిమిదో వారానికి సంబందించిన నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టి నామినేట్ చేసినవారి ఫోటోని మంటల్లో వేయించి ముగించేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈవారం 8 మంది నామినేషన్స్ లోకి వెళ్లగా.. ఇంతకుముందే ఇద్దరు డైరెక్ట్ గా నామినేట్ అయ్యి ఉన్నారు. వాసంతి గత వారం హౌస్ లో ఉండేందుకు అనర్హురాలు అంటూ డైరెక్ట్ గా నామినేట్ అవ్వగా.. రోహిత్ బ్యాటరీ ఛార్జ్ కోసం రెండు వారాలు డైరెక్ట్ నామినేషన్స్ లోకి వెళ్ళాడు. అయితే ఈవారం ఎనిమిదిమందిని హౌస్ మేట్స్ నామినేట్ చేసారు. అందులో బాలాదిత్య, గీతూ, ఆది రెడ్డి, రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, మెరీనా, రాజశేఖర్ నామినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.