బాలీవుడ్ లో దివాళి సెలెబ్రేషన్స్ అనేది ఎప్పటినుండో వస్తున్న ఆచారం. అక్కడి సెలబ్రిటీస్ దివాళిని సెలెబ్రేట్ చేసుకోవడమే కాదు.. వారం ముందునుండే.. అదిరిపోయే పార్టీలు ఇచ్చి సెలబ్రిటీస్ ని ఆహ్వానిస్తారు. ఆ పార్టీలకి సెలబ్రిటీస్ సీతాకోక చిలుకల్లా రంగురంగుల డిజైనర్ వెర్స్ తో హాజరై ఫాన్స్ కి ట్రీట్ ఇస్తారు. ఇక కొన్నాళ్లుగా ఆ సాంప్రదాయం టాలీవుడ్ లోను మొదలయ్యింది. మెగా ఫ్యామిలిలో దివాళి సెలెబ్రేషన్స్ జరగడం కొన్నేళ్లుగా వింటున్నాం, చూస్తున్నాం. గత ఏడాది అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ అందరితో కలిసి దివాళి పార్టీ ఇచ్చారు.
అదే ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ గత రాత్రే అంటే ఆదివారం రాత్రే తన ఇంట్లో దివాళి సెలెబ్రేషన్స్ చేసేసారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లు హోస్ట్ లుగా ఈ పార్టీ అంగరంగ వైభవంగా జరిగినట్టుగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిల్ రాజు కూతురు ఇంకొంతమంది ఈ పార్టీకి హాజరవగా.. అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ పార్టీలో దర్శనమిచ్చినా.. మెగా ఫ్యామిలోని చిరు, రామ్ చరణ్, వరుణ్, సాయి తేజ్ లాంటి వారు ఈ పార్టీలో కనిపించలేదో.. లేదంటే వాళ్ళ పిక్స్ బయటికి రాలేదో కానీ.. ప్రస్తుతం, అల్లు అర్జున్ దివాళీ పార్టీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది.