సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడన్న సంగతి అందరికి తెలిసినదే. మహేష్ బాబు తన వ్యక్తిగత పనులకై విదేశాలకి వెళ్ళాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఇటలీ లో ఉన్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు సన్నిహిత వర్గాల ప్రకారం అతను స్వదేశానికి తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతున్నాడు. మహేష్ బాబు అక్టోబర్ 24 న హైద్రాబాద్ లో ఉంటాడు.
మహేష్ బాబుకి కొద్దిరోజుల క్రితం మాతృవియోగం కలిగింది. మహేష్ తల్లి ఇందిరా దేవి స్వర్గస్తులైయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు తన వ్యక్తిగత పనులని పూర్తిచేసుకోవడానికి విదేశాలకి వెళ్ళాడు. మహేష్ బాబు కొన్ని నెలల క్రితం సర్కారు వారి పాట అనే చిత్రంతో అభిమానులని అలరించాడు. ప్రస్తుతం మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అటుపై దిగ్గజ దర్శకుడు రాజమౌళి తో జతకడుతున్నాడు.
మహేష్-త్రివిక్రమ్ చిత్రం మొదటి షెడ్యూల్ కొన్నివారాల క్రితం పూర్తయ్యింది. మహేష్ బాబు తిరిగి వఛ్చిన తర్వాత, చిత్ర నిర్మాతలు తదుపరి షెడ్యూల్ ని ప్రారంభిస్తారు. నిర్మాతలు నవంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ చిత్రంలో, మహేష్ బాబు సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. థమన్ సంగీతదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23,2023 న విడుదల చేయాలని సిద్ధమవుతున్నారు.