Advertisementt

జబర్దస్త్ అందాలు, కామెడీ.. స్టార్ మా స్టేజ్ పై

Sun 23rd Oct 2022 12:36 PM
bigg boss,jabardasth,rashmi  జబర్దస్త్ అందాలు, కామెడీ.. స్టార్ మా స్టేజ్ పై
Rashmi and Hyper Aadi in Bigg Boss Diwali event జబర్దస్త్ అందాలు, కామెడీ.. స్టార్ మా స్టేజ్ పై
Advertisement
Ads by CJ

జబర్దస్త్ వదిలేసి కొంతమంది కమెడియన్స్ స్టార్ మా కి జంప్ అయ్యారు అది ఓకె. అలాగే అక్కడ జబర్దస్త్ కమెడియన్స్ ని స్టార్ మా బిగ్ బాస్ కోసం పట్టుకొచ్చేసింది. అలా అవినాష్, చంటి, ఫైమా వచ్చారు. అందులో అవినాష్ విషయంలో, ఫైమా విషయం స్టార్ మా అంచనా తప్పలేదు. వీరిద్దరూ బిగ్ బాస్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు  కూడా. చంటి ఈ విషయంలో ఫెయిల్ అయ్యి బిగ్ బాస్ హౌస్ ని తొందరగా వదిలేసాడు. అయితే తాజాగా జబర్దస్త్ లో కామెడీ చేస్తున్న వారు, అక్కడ యాంకరింగ్ చేస్తున్న వారు కూడా స్టార్ మా బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది.

అందులో హైపర్ ఆది జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్కిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఆది స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 6 ఏడో వారం దివాళి ఈవెంట్ లో తళుక్కున మెరిశాడు. నాగార్జున పక్కనే ఉండి జబర్దస్త్ పంచ్ లతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఓ ఆట ఆడుకున్నాడు. ఇనాయ నువ్వు ఆట మార్చుకో మనుషులని మార్చకు అంటూ కామెడీ చేసాడు. అలాగే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్ స్టార్ మా బిగ్ బాస్ దివాళి ఈవెంట్ లో ప్రత్యేక పాటతో ఆకట్టుకుంది. అట్టా సూడకే.. అంటూ రెచ్చిపోయి బిగ్ బాస్ స్టేజ్ పై డాన్స్ చేసింది. ఆమె బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రమోషన్స్ కోసం స్టార్ మా స్టేజ్ పైకి వచ్చింది.

అలా జబర్దస్త్ రష్మీ, హైపర్ ఆది స్టార్ మా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసారు.

Rashmi and Hyper Aadi in Bigg Boss Diwali event:

Bigg Boss season 6 Diwali event promo highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ