Advertisementt

సోషల్ మీడియా జర జాగ్రత్త

Sat 22nd Oct 2022 10:40 PM
prabhas,prabhas birthday,social media  సోషల్ మీడియా జర జాగ్రత్త
Beware social media సోషల్ మీడియా జర జాగ్రత్త
Advertisement
Ads by CJ

రేపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. అయితే ప్రభాస్ బర్త్ డే వేడుకలకి దూరంగా ఉంటున్నారని, ఆయన పెదనాన్న కృష్ణం రాజు మరణం సంభవించి కొద్ది రోజులే కావడంతో ప్రభాస్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ బర్త్ డే వేడుకలకి దూరంగా ఉన్నప్పటికీ ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీస్ నుండి ట్రీట్స్ రాబోతున్నాయి. ప్రభాస్ బర్త్ డే చేసుకోవడం లేదని తెలిసిన ఫాన్స్ డిస్పాయింట్ అయినా.. ఆయన నటించే సినిమాల నుండి వచ్చే అప్ డేట్స్ కోసం కాపు కచేసారు. ఇప్పటికే ఆదిపురుష్ నుండి ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ కన్ ఫర్మ్ అయ్యింది. మరోపక్క సలార్ నుండి పోస్టర్ కానీ, గ్లిమ్ప్స్ కానీ రాబోతున్నట్టుగా ఫాన్స్ హడావిడి చేస్తున్నారు.

అలాగే బర్త్ డే స్పెషల్ గా ప్రాజెక్ట్ K నుండి నాగ్ అశ్విన్ పోస్టర్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే మారుతి కూడా ప్రభాస్ బర్త్ డే తో ఫాన్స్ కి దిమ్మతిరిగే సర్ ప్రైజ్ ప్లాన్ చేసాడంటున్నారు. అస్సలు మొదలే కాని సందీప్ రెడ్డి వంగా నుండి స్పిరిట్ తో ప్రభాస్ మాస్ ఎంట్రీ పక్కా అంటున్నారు. మరి ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాపై పడి ట్రెండ్ చేసేందుకు ప్రభాస్ ఫాన్స్ ఆతృతగా కాదు కసిగా ఉన్నారు. అసలే రాధేశ్యామ్, సాహో సినిమాల ప్లాప్స్ తో డిస్పాయింట్ మూడ్ లో ఉన్న ఫాన్స్.. ఇప్పుడు ప్రభాస్ నుండి క్రేజీగా రాబోతున్న చిత్రాలపై నమ్మకంతో ఉన్నారు. మరోపక్క బిల్లా 4K రీ రిలీజ్ తో ఓవర్సీస్ లో ప్రభాస్ ఫాన్స్ ఊగిపోతున్నారు. ఇక రేపు సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రభాస్ బర్త్ డే అప్ డేట్స్ తో షేక్ అవడం ఖాయమనే న్యూస్ చూసిన నెటిజెన్స్ కూడా సోషల్ మీడియా జర జాగ్రత్త అంటూ కామెంట్ చేస్తున్నారు.

Beware social media:

Prabhas birthday updates in social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ