Advertisementt

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఊరట

Sat 22nd Oct 2022 10:19 PM
jacqueline fernandez,ed,bollywood  జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఊరట
Big relief for Jacqueline Fernandez జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఊరట
Advertisement
Ads by CJ

శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన అందచందాలతో బాలీవుడ్ ని ఏలాలని ఎన్నో కలలు కంది. ఆ దిశగా ప్రయత్నాలు సఫలం అవుతున్న సమయయంలో ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ.డి) ఉచ్చులో ఇరుక్కుంది. నెలల తరబడి విచారణ జరుగుతుండగా, ఈ రోజు ఈడీ  ఢిల్లీ న్యాయస్థానం ముందు జాక్వెలిన్ తాత్కాలిక బెయిల్ మంజూరును వ్యతిరేకిస్తూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారతదేశం నుండి పారిపోవడానికి ప్రయత్నించింది, సాక్ష్యాలను నాశనం చేయడానికి వెనుకాడలేదు అని వాదించింది.

ఈడీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సుకేశ్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుందన్న దానిపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

అయితే కోర్టు విచారిస్తూ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి భారీ ఉపశమనంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విచారణను నవంబర్ 4కి వాయిదా వేస్తూ అన్ని పార్టీలకు ఛార్జ్ షీట్ మరియు ఇతర సంబంధిత పత్రాలను అందించాలని కోర్టు ఆదేశించింది. దానితో జాక్వలిన్ కి భారీ ఊరట కలిగింది. అయితే ఈడీ ఇంటరాగేషన్ కారణంగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన రంగంలో అనేక అవకాశాలను కోల్పోతోంది. పవన్ కళ్యాణ్ యొక్క హరి హర వీర మల్లు నిర్మాతలు మొదట జాక్వెలిన్‌ను ఒక ముఖ్యమైన పాత్రలో నటింపచేయాలని అనుకున్నారు, తరువాత ఆమె స్థానంలో నోరా ఫతేహిని తీసుకున్నారు. జాక్వెలిన్ ఇటీవల కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణలో ప్రత్యేక పాటతో సినీ ప్రేమికులను అలరించింది.

Big relief for Jacqueline Fernandez:

Jacqueline Fernandez gets interim bail

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ