Advertisementt

బిగ్ బాస్ 6: ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్

Sat 22nd Oct 2022 08:16 PM
bigg boss 6,arjun kalyan,big boss telugu  బిగ్ బాస్ 6: ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్
Bigg Boss 6: Arjun Kalyan Gets Evicted బిగ్ బాస్ 6: ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 6 ఏడో వారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న వారు కాకుండా.. మరో వ్యక్తి ఎలిమినేట్ అవడం షాకింగ్ గా ఉంది. ఇప్పటివరకు అంటే గత వీక్స్ లో ఓటింగ్స్ ఆధారంగానే కంటెస్టెంట్స్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం మరీనా, రాజ్, వాసంతి, ఇనాయ లతో ఈ ఎలిమినేషన్ దోబూచులాడింది. ఫైనల్ గా రాత్రి శుక్రవారం ఓటింగ్ ముగిసే సమయానికి వాసంతి-ఇనాయ డేంజర్ జోన్ లో ఉండగా.. ఈ వారం వాళ్ళిద్దరిలో ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అంటే ఈ వారం ఎలిమినేషన్ లో ఆడియన్స్ కి బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

ఈ వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యి ఏడో వారం ఏడో కంటెస్టెంట్ గా హౌస్ ని వీడాడు. హౌస్ లోకి వచ్చాక అర్జున్ శ్రీ సత్య, వాసంతి లతో లవ్ ట్రాక్ నడిపించేందుకు ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. టాస్క్ పరంగా వీక్, మధ్యలో రేవంత్ తో గొడవలు, నాగార్జున తిట్లు, వారం వారం నాగ్ చేతిలో క్లాస్, అప్పుడప్పుడు శ్రీసత్య అరుపులు.. ఇలా అర్జున్ కళ్యాణ్ వీక్ కంటెస్టెంట్ గా తయారయ్యాడు, రెండు వారాలుగా అర్జున్ కళ్యాణ్ టాస్క్ ల్లో కాస్త ప్రదర్శన ఇస్తున్నా, శ్రీసత్య మోటివేషన్ వల్లనే అని అడుగడుగునా అర్ధమయ్యింది. కానీ ఇలా అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అనేది మాత్రం అందరికి షాకింగ్ విషయమే అని చెప్పాలి.

Bigg Boss 6: Arjun Kalyan Gets Evicted:

Bigg Boss 6: Arjun Kalyan Gets Evicted this week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ