అను ఇమ్మాన్యువల్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా చక్రం తిప్పుదామని గ్లామర్ చూపించి ఎంతగా ట్రై చేసినా ఆమెకి వర్కౌట్ అవ్వలేదు. మజ్ను, ఆఖరికి మెగా టాప్ హీరో పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, తర్వాత అల్లు అర్జున్ నా పేరు సూర్య, శర్వానంద్ తో మహాసముద్రం ఇలా టాప్ స్టార్స్ తో సినిమాలు చేసినా ఆమెకి కలిసి రాలేదు. దానితో సైలెంట్ అయిన అను ఇమ్మాన్యువల్ మళ్ళీ మెల్లగా మెగా కాంపౌండ్ నుండే బయటికి వచ్చింది. మెగా యంగ్ హీరో అల్లు శిరీష్ తో ఉర్వశివో రాక్షసివో అంటూ టైటిల్ పాత్ర పోషిస్తుంది. అల్లు శిరీష్ తో రొమాంటిక్ గా అను ఈ చిత్రంలో రెచ్చిపోయింది.
అయితే తాజాగా అను ఇమ్మాన్యువల్ మీడియా మీద చిందులు తొక్కింది. ఆమెకి కోపం వచ్చింది. కారణం అల్లు అర్జున్ తో నా పేరు సూర్య చేసారు, తమ్ముడు శిరీష్ తో ఉర్వశివో రాక్షసివో సినిమాలు చేసారు. అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటి అనగానే ఎందుకో అనుకి సమాధానం చెప్పాలనిపించలేదు. దానితో కోపం తో అడగడానికి ఇంతకన్నా మంచి ప్రశ్నలు లేవా మీకు అంటూ సదరు రిపోర్టర్ పై అసహనం వ్యక్తం చేసింది. అయినా సదరు రిపోర్టర్ ఆగలేదు. ఈ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏమిటని అడగడంతో.. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదని.. అందువల్ల దీనికి సమాధానం చెప్పలేనని అంటూ తప్పించుకుంది.