మెగా స్టార్ చిరంజీవి - రవితేజ కలిసి తెరపై కలిసి కనపడితే అభిమానులకి పూనకాలు వస్తాయి. ప్రస్తుతం దర్శకుడు బాబి అభిమానుల కలని నిజం చేస్తున్నాడు. చిరంజీవి 154 చిత్రంలో మాస్ రాజా రవితేజ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. చిత్ర దర్శక నిర్మాతలు ఈ చిత్ర టైటిల్ టీజర్ ను దీపావళి సందర్భంగా అక్టోబర్ 24, 11.07 AM కి ప్రకటిస్తున్నారు. ఎప్పటినుంచో చిత్రానికి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ పెడతారని అనుకుంటున్నారు. స్వయంగా చిరంజీవే ఒకానొక సందర్భంలో చిత్రం పేరు వాల్తేర్ వీరయ్య అని చెప్పేసాడు.
తాజా సమాచారం ప్రకారం బాబీ ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ ల పై ఒక మాస్ సాంగ్ ని చిత్రించబోతున్నాడని. ఈ మాస్ సాంగ్ అభిమానులని ఊరిస్తూ చిరంజీవి, రవితేజ తెర పై కనపడగానే పూనకంతో చిందులేస్తారని దర్శకనిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కి మాస్ బీట్ స్వరపరుస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయకిగా నటిస్తోంది. చిరంజీవి, రవితేజ సవతి అన్న తమ్ముళ్ళల్లాగ నటిస్తూ, రవితేజ పోలీస్ అయ్యి, తర్వాత చిరంజీవిని బంధించడానికి ప్రయత్నిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్ఛే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.