తారక్ కొన్నాళ్లుగా అభిమానులని అయోమయంలో పడేస్తూనే ఉన్నాడు. ఫాన్స్ ఆందోళన పడుతున్నా ఎన్టీఆర్ మాత్రం కూల్ గానే కనిపిస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఎవ్వరికీ నచ్చడం లేదు. ఫాన్స్ మాత్రమే కాదు, మూవీ లవర్స్ అంతా తారక్ నెక్స్ట్ మూవీతో ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతాడా అని ఎదురు చూస్తున్నారు. అటు లుక్ పరంగాను ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళనలో ఉన్నారు. కానీ ఎన్టీఆర్ జపాన్ ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చినప్పటినుండి తారక్ ఫాన్స్ థ్రిల్ అవుతూనే ఉన్నారు. జపాన్ లో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్, అలాగే అభిమానులతో మింగిల్ అవడం ఇవన్నీ చూసి తారక్ ఫాన్స్ సర్ ప్రైజ్ అవుతూనే ఉన్నారు.
రాజమౌళి తో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ ప్రెస్ మీట్, అక్కడి ఫాన్స్ కి జపాన్ లో స్పీచ్ ఇవ్వడం, ఆయన లుక్స్, భార్య ప్రణతితో తారక్ ఎంజాయ్ చెయ్యడం అబ్బో ఇవన్నీ తారక్ ఫాన్స్ చూసి ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. రామ్ చరణ్ తో కలిసి ఉన్న తారక్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇదే కాకుండా వచ్చే నెలలో తారక్-కొరటాల NTR30 మొదలు కాబోతున్నట్టుగా తెలియడంతో ఫాన్స్ అస్సలాగడం లేదు.