ప్రస్తుతం జక్కన్న తన దృష్టినంతా భారతంలో అర్జునుని వలే , భారతదేశానికి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ని తన చిత్రం ఆర్.ఆర్. ఆర్. ద్వారా తీసుకొచ్చి అందరికలలని సాకారం చేయాలని విశ్వవ్యాప్తంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత ప్రభుత్వం తన అధికారిక చిత్రంగా గుజరాతీ చిత్రం చేల్లో షో ని ఆస్కార్ కి పంపించగా, రాజమౌళి తన చిత్రం ఆర్.ఆర్. ఆర్. కి ప్రపంచమంతా అద్భుత స్పందన రావడంతో, నిర్మాతలు స్వయంగా ఆర్.ఆర్.ఆర్ ని ఆస్కార్ బరిలో నిలపాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే అమెరికా లో రాజమౌళి ఆర్.ఆర్. ఆర్. ని ప్రచారం చేయగా, ప్రస్తుతం జపాన్ లో రాజమౌళికి తోడుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోడుగా నిలిచారు. వీరంతా జపాన్ లో ఆర్.ఆర్. ఆర్. ని ప్రచారం చేస్తున్నారు. జపాన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లని అభిమానులు ఏ విధంగా చుట్టుముట్టారో, ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాలలో కనపడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ అయితే జపాన్ లో అభిమానులకి స్పీచ్ ఇచ్చి వారి మనసులని దోచేశాడు. అలాగే అభిమానులతో సెల్ఫీలు దిగుతూ చరణ్, ఎన్టీఆర్ హంగామా వీడియోస్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇక ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చరణ్ వైఫ్ ఉపాసనలు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. చేతుల్లో చేతులు వేసుకుని ఈ జంటలు జపాన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోసారి జపాన్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల దోస్తీ అందరినీ అలరిస్తోంది. ఆర్.ఆర్. ఆర్. లో దోస్తీ పాట వినపడుతుండగా, రామ్ చరణ్, ఎన్ఠీఆర్, తమ భార్యలు ఉపాసన మరియు లక్ష్మి ప్రణతి తో నడుస్తూ వెళ్లడం అందరిని అలరిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆర్.ఆర్. ఆర్. కి జపాన్ దేశంలో అద్భుత స్పందన వస్తోంది.