జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ బిగ్ బ్యానర్ వైజయంతి మూవీస్ లో స్వప్న దత్ నిర్మాణంలో దర్శకుడిగా లాంచ్ అయ్యి మొదటి సినిమాతోనే బిగ్గెట్స్ హిట్ కొట్టేసాడు. కరోనా పాండమిస్ సిట్యువేషన్ లో భారీ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన జాతిరత్నాలను ఆడియన్స్ ఆదరించడమే కాదు, బ్లాక్ బస్టర్ హిట్ కట్టబెట్టారు. దానితో అనుదీప్ రేంజ్ ఒక్కసారిగా చేంజ్ అయ్యింది. స్టార్ హీరోల ఛాన్స్ లు వచ్చేస్తాయన్న తరుణంలో అనుదీప్ తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ మొదలు పెట్టాడు. మధ్యలో అనుదీప్ కర్త, కర్మ, క్రియ అయ్యి తీసిన ఫ్రై డే ఫస్ట్ షో వార్తల్లో లేకుండా డిసాస్టర్ అవడంతో.. అనుదీప్ ప్రిన్స్ పై కాస్త అనుమానాలు మొదలయ్యాయి.
అయినప్పటికీ శివ కార్తికేయన్ ప్రిన్స్ పై ఆశక్తిని పెంచుతూ చేసిన ప్రమోషన్స్, విజయ్ దేవరకొండ ప్రిన్స్ కి సపోర్ట్ చేస్తూ ప్రీ రిలీజ్ కి హాజరడంతో అంతో ఇంతో ఆసక్తి ప్రిన్స్ పై ఏర్పడినా.. ఆ అంచనాలు ప్రిన్స్ ఓపెనింగ్స్ మాత్రం కలిసి రాలేదు. అటు ఓపెనింగ్ మాత్రమే కాదు.. నాలుగైదు సినిమాల మధ్యన దివాళి పోటీలో ప్రిన్స్ ని దించారు. అసలే బిగ్ ఫైట్, ఇటు చూస్తే సినిమాకి పూర్ టాక్, పూర్ రివ్యూలు రావడం మేకర్స్ ని షాక్ కి గురి చేసింది. కొన్ని వెబ్ సైట్స్ ని రివ్యూల విషయంలో మ్యానేజ్ చేసినా.. ప్రిన్స్ కి ఫలితం దక్కలేదు. అప్పుడేదో అనుదీప్ కి కలిసొచ్చి జాతిరత్నాలు హిట్ అయినా.. ఇప్పుడు ప్రిన్స్ విషయంలో అనుదీప్ మ్యాజిక్ చెయ్యలేక చేతులెత్తేశాడు. మొదటి రోజుకే ప్రిన్స్ పరిస్థితి అలా ఉంటే.. హిట్ టాక్ తెచ్చుకున్న ఓరి దేవుడా, జిన్నా, సర్దార్ మూవీస్ మధ్యలో ప్రిన్స్ ఎలా నిలబడుతుందో చెప్పడం కష్టమే.