బిగ్ బాస్ సీజన్ 6 లో ఏడో వారం ఎవరెవరికి నాగార్జున చేతిలో తిట్లు పడతాయో అని తెగ ఎదురు చూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అందులో ఈ వారం ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో ఎవరూ సరిగ్గా ఆడలేదు. శ్రీహన్, సూర్య తప్ప మిగతా ఎవ్వరూ టాస్క్ లో బెస్ట్ ఇవ్వలేకపోవడంతో బిగ్ బాస్ కే కోపం వచ్చి అందరికి తగిన శిక్ష వేసాడు. ఇక ఈ వారం నాగార్జున శనివారం రావడం హౌస్ మేట్స్ కి క్లాస్ పీకడం కూడా జరిగిపోయింది. రాత్రి రాబోయే ఎపిసోడ్ ప్రోమోని వదిలింది స్టార్ మా. ఆ ప్రోమోలో నాగార్జున పప్పు అన్నాడంటూ రేవంత్ కి క్లాస్ పీకారు.
అర్జున్ కళ్యాణ్ ని అరే పప్పు అన్నాడని శ్రీ సత్య అర్జున్ కి చెప్పడంతో అర్జున్ కి రేవంత్ కి గొడవ జరిగింది. ఆ విషయమై నాగార్జున ఈరోజు రేవంత్ ని అడుగడుగునా పప్పు పప్పు అంటూ క్లాస్ పీకారు. అలాగే శ్రీసత్యని లేపి పప్పు అన్నాడని చెప్పావ్ కరెక్ట్ ఆ అని అడిగితే.. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పప్పు అంటే ఓకె.. కానీ టాస్క్ లో అనకూడదు అంది. రేవంత్ ని లేపి అతన్ని పప్పు అనడం ఏమిటి అంటూ క్లాస్ పీకగా.. శ్రీసత్య ముందు నువ్వు నామినేట్ అవుతానని చిట్టీలు వేసి ఒప్పుకున్నావ్.. తర్వాత ఓటింగ్ కి వెళ్ళావ్ అది కరెక్టా అని నాగ్ అడిగితే.. ఎలాగూ ఈ వారం నాగార్జున గారి చేతిలో తిట్లు పడతాయి.. ఇలా డైరెక్ట్ గా నామినేట్ అయ్యి తిట్టించుకోవడం ఇష్టం లేదు అనగానే.. తప్పంతా నా మీదకి నెట్టేశారు అంటూ నాగార్జున గుస్సా అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.