జబర్దస్త్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కళకళలాడే అనసూయ ఇప్పుడు ఎప్పుడో కానీ దర్శనమివ్వడం లేదు. ఈ మధ్యన గాడ్ ఫాదర్ లో ఛానల్ ఓనర్ గా కనిపించినా.. అనసూయకి అంతగా పేరొచ్చింది లేదు. అనసూయ కొద్దిగా వెయిట్ కూడా పెరగడంతో ఆమెకి అవకాశాలు కూడా తగ్గాయి. జబర్దస్త్ తో వారం వారం కామెడీ ప్రియులని అలరించిన అనసూయ.. గురువారం వస్తే చాలు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ వదిలి కిక్ ఇచ్చేది. కానీ ఇప్పుడు వెండితెర మీద చిన్న చిన్న కేరెక్టర్స్ చేస్తూ హైలెట్ అవుతుంది.
మీడియా కి దూరంగానే ఉంటుంది. అప్పుడప్పుడు కాంట్రవర్సీ విషయాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే అనసూయ ఇప్పుడు సోషల్ మీడియాలో భర్త తో కలిసి ఫొటోస్ షేర్ చేస్తుంది. అయితే అనసూయ హావ ఛానల్స్ లో తగ్గడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అది జబర్దస్త్ నుండి తప్పుకోవడమే ఆమె క్రేజ్ తగ్గడానికి ప్రధాన కారణమంటున్నారు. స్టార్ మా లో సూపర్ సింగర్ పూర్తయ్యాక అనసూయ మళ్ళీ ఏ ఛానల్ లో యాంకరింగ్ చేస్తూ కనిపించలేదు. ఏదో సినిమా షూటింగ్స్ లో బిజీగా వుంటున్నా అంటూ బిల్డప్ ఇస్తుంది. అంటే ఈ మధ్యన గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కి రాలేదేమిటి అంటే.. షూటింగ్స్ లో బిజీ అని చెప్పిందిలే..