Advertisementt

అతిలోకసుందరి కూతురి దుస్థితి

Fri 21st Oct 2022 09:37 PM
janhvi kapoor,sridevi  అతిలోకసుందరి కూతురి దుస్థితి
Janhvi Kapoor targets remake movies అతిలోకసుందరి కూతురి దుస్థితి
Advertisement
Ads by CJ

అతిలోక సుందరిగా శ్రీదేవి తెలుగు వారి హృదయాలలో తన అందచందాలతో, మరిచిపోలేని హావభావాలతో చెరగని ముద్ర వేసింది. ఆమెపై తెలుగు వారి ప్రేమ గుండెల్లో గూడుకట్టుకుని ఉంది. అందుకే ఇక్కడి ప్రేక్షకులు ఆమె కూతుర్లు జాన్వీ మరియు ఖుషీ అరంగేట్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకుని ఆతృతగా ఎదురుచూడసాగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు, జాన్వీ ని తెలుగులో పరిచయం చేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ వారి ఆశల పై చన్నీళ్ళు పోస్తూ శ్రీదేవి తన కూతురిని కరణ్  జోహార్ చేతులలో పెట్టింది. సరే పోనిమ్మని తెలుగువాళ్లు కరణ్  జోహార్ ఏ విధంగా ఆమెని బాలీవుడ్లో పరిచయం చేస్తాడో అని ఎదురు చూస్తే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె ని మరాఠీ చిత్రం సైరస్ అనువాదం ధఢక్ తో పరిచయం చేసారు. శ్రీదేవి కూతురనే అభిమానంతో అందరూ ఆ చిత్రాన్ని హిట్ చేశారు.

కానీ ఆమె తర్వాత చిత్రాలు కూడా అగ్ర దర్శకులు, అగ్ర తారల సరసన కాకుండా అనువాదాల పై మొగ్గు చూపడంతో, అంతా  అతిలోక సుందరి కూతురికి ఏమిటీ దుస్థితి అని బాధపడుతున్నారు. చిన్న చిన్న చిత్రాలు చేస్తుకుంటూ, టాలీవుడ్లో వస్తున్న అగ్ర తారల చిత్రాలని చిన్న చూపు చూస్తూ, వాటిని నిరాకరిస్తూ జాన్వీ తన కెరీర్ ని నాశనం చేసుకుంటోంది. ప్రస్తుతం ప్రతిరోజూ తన సొగసులు బహిర్గతం చేస్తూ సామజిక మాధ్యమాలలో ఫోటోలని పెట్టడం తప్ప చేస్తున్నదేమీ లేదు.

ఆమె తండ్రి, బోనీ  కపూర్ ఎందుకు కూతురికి సరైన మార్గదర్శకత్వం చేయలేకపోతున్నాడో, ఎవరికీ అర్ధం కావడంలేదు. అది కాకుండా, అతని చిన్న కూతురు ఖుషి కూడా వెండితెర పై అరంగేట్రం కాకుండా హాలీవుడ్ కామిక్ ఆర్చీస్ అనువాదం వెబ్ సిరీస్ లో నటిస్తోంది. జాన్వీ, ఖుషి తన తల్లి అతిలోకసుందరి శ్రీదేవి ఖ్యాతిని తమ చేష్టలతో మసకబారుస్తున్నారు.

Janhvi Kapoor targets remake movies:

Sridevi daughter Jhanvi Kapoor photoshoot viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ