బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ గ్లామర్ విషయంలో హద్దులు దాటేస్తున్నారు. శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్ ఇలా ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న ఈ తారామణులు అందాలు ఆరబొయ్యడంలో సీనియర్స్ ని మించిపోయారు. బాలీవుడ్ లో దివాళి బాష్ అంటూ సెలబ్రిటీస్ పార్టీలు చేసుకుంటారు. ఏక్తాకపూర్ దగ్గరనుండి కరణ్ జోహార్, అలాగే ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇలా చాలామంది దివాళి పార్టీలు చేస్తారు. ఈ పార్టీలకి సెలబ్రిటీస్ అందంగా రెడీ అయ్యి వాలిపోతారు. నిన్న రాత్రి ముంబైలో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో దివాళి సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి.
ఈ సెలబ్రేషన్ కి జాన్వీ కపూర్ మనీష్ మల్హోత్రా డిజైనర్ శారీలో టూ మచ్ గ్లామర్ చూపిస్తూ చెల్లి ఖుషి కపూర్ తో ఎంటర్ అయ్యింది. ఇక అదే పార్టీకి అనన్య పాండే కూడా అందాలు చూపుతూ సారీ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాజరయ్యింది. సక్సెస్ ఫుల్ బ్యూటీ సారా అలీ ఖాన్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ లో కివెజ్ షో చేస్తూ హొయలు పోయింది. అలాగే రకుల్, కియారా అద్వానీ, తాప్సి ఇలా చాలామంది ఆ పార్టీకి వచ్చినప్పటికీ.. అందరూ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ అందాలనే హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మరి గ్లామర్ విషయంలో ఈ కుర్ర బ్యూటీస్ హద్దులు దాటేస్తున్నారంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.