మహేష్ బాబు మొదటి నుండి లుక్ లో పెద్దగా వేరియేషన్స్ చూపించరు. పోకిరి, అతిధి ఇలా కొన్ని కొన్ని సినిమాల్లోనే హెయిర్ పెంచి కొత్తగా కనిపించారు. తర్వాత ఆల్మోస్ట్ మహేష్ బాబు హ్యాండ్ సమ్ లుక్ లోనే స్టైలిష్ గా కనిపించేవారు. అయితే ఈమధ్యన త్రివిక్రమ్ తో చేస్తున్న SSMB28 కోసం మహేష్ బాబు లుక్ ని చేంజ్ చేసారు. కొత్తగా కనిపించారు. కానీ ఆ కొత్త లుక్ విషయంలో మహేష్ అభిమానులు సంతోషంగా లేరు. చిన్నపాటి గెడ్డం పెంచినా ఎందుకో మహేష్ కి అది సూట్ కాలేదన్నారు. అటు మహేష్ కూడా SSMB28 ఫస్ట్ షెడ్యూల్ చూసాక లుక్ విషయంలో అనుమాన పడ్డారనే వార్తలొచ్చాయి. ఇక ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మహేష్ వ్యక్తిగతంగా కాస్త సిక్ అయ్యారు.
అందుకే ప్రస్తుతం SSMB28 సెకండ్ షెడ్యూల్ కూడా డిలే అవుతుంది. అదలా ఉంటే.. ఈ రోజు శుక్రవారం ఉదయం మహేష్ వైఫ్ నమ్రత.. మహేష్ కొత్త లుక్ ని షేర్ చేసారు. మహేష్ ఇంటెన్స్ లుక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. వైట్ షర్ట్ లో మహేష్ లుక్ అదిరిపోయింది అంటూ అభిమానులు కూడా హ్యాపీ గా ఫీలవుతున్నారు. ప్రస్తుతం మహేష్ కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.