బాలీవుడ్ లో నిలదొక్కుకుండేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్న రకుల్ ప్రీత్ ని టాలీవుడ్ ఎప్పుడో లైట్ తీసుకుంది. రకుల్ ప్రీత్ తెలుగులో చివరిగా చేసిన ఫిలిం కొండపోలం. ఆ సినిమా డిసాస్టర్ రకుల్ ని వెనకపడిపోయేలా చేసింది. తెలుగులో అవకాశాలు లేకపోయినా.. బాలీవుడ్ సినిమాల్లో బిజీగా మారిన రకుల్ ప్రీత్ అక్కడ స్టార్ స్టేటస్ కోసం యుద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన సినిమా డాక్టర్ G, థాంక్ గాడ్ రిలీజ్ కి దగ్గరపడడంతో ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కోసం రకుల్ ప్రీత్ గ్లామర్ రచ్చ సోషల్ మీడియాని ఊపేస్తోంది. బాగా సన్నబడి జీరో సైజ్ కి మారిన రకుల్.. కాస్త బొద్దుగా అయితే బావుంటుంది అంటూ చాలామంది కామెంట్స్ చేసారు. అయినా రకుల్ జిమ్ వర్కౌట్స్ తో జీరో సైజ్ నే మెయింటింగ్ చేస్తూ గ్లామర్ చూపిస్తుంది. ఎంతగా సన్నబడినా స్మైల్ ఫేస్ తో రకుల్ మొహం కళగానే కనిపిస్తుంది. క్లివేజ్ షో తో బ్లాక్ డ్రెస్, గ్రీన్ డ్రెస్, రెడ్ డ్రెస్, వైట్ డ్రెస్ అంటూ రకుల్ డాక్టర్ G, థాంక్ గాడ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది, తన ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో గంటగంటకి అప్ లోడ్ చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు ఉండేలా చూసుకుంటుంది.