పూజ హెగ్డే తన అందచందాలతో అందరిని అలరిస్తూ కుర్రకారుకి నిద్రలేని రాత్రుల్ని ప్రసాదిస్తోంది. బుట్టబొమ్మగా అందరి గుండెలను దోచి ప్రస్తుతం భారతదేశం అంతా అందాలరాణి గా మన్ననలందుకుంటోది. అలాంటి బుట్టబొమ్మకి గాయం అయిందన్న విషయం బయటకి పొక్కగానే అందరూ ఆందోళనకి గురవుతున్నారు. పూజ హెగ్డే ఈ రోజు తన సామజిక మాధ్యమంలో తన పాదానికి గాయమైన చిత్రాన్ని పెట్టి, ఓకే అప్పుడు లిగమెంట్ టియర్.
ఆమె పాదానికి గాయమైన సంగతి తెలియగానే, అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకి గురయ్యారు. పూజ పాదానికి గాయం అవటం వల్ల కొద్ది రోజులు ఆమె షూటింగులలో పాల్గొనలేదు. కొన్ని రోజుల క్రితమే ఆమె తన పుట్టిన రోజుని హ్యాపీ గా జరుపుకుంది. పూజ హెగ్డే, సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో నటిస్తోంది. పూజ పుట్టిన రోజున, సల్మాన్ ఖాన్ మరియు వెంకటేష్ లు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ పూజ తో కేక్ కట్ చేయించారు. పూజ ఉబ్బితబ్బిబవుతూ ఇద్దరికీ కేక్ ముక్కలని తినిపించింది. ఈ చిత్రంలో జగపతి బాబు ముఖ్య భూమికను పోషిస్తుండగా, రామ్ చరణ్ ఒక పాటలో సల్మాన్ ఖాన్ ఖాన్ తో నర్తించనున్నాడు. పూజ హెగ్డే మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ చిత్రం సర్కస్ లో రణ్వీర్ సింగ్ సరసన నటిస్తోంది.