దిగ్గజ సంగీత దర్శకుడు రెహమాన్ గురించి తెలియని వారు ఉండరు. భారత సంగీతాన్ని ఖండాంతరాలలో ఖ్యాతిని పెంచడమే కాదు, ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నాడు. రెహమాన్ తాజాగా జక్కన రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేసాడు. మగధీర చూసినప్పుడు, ఈ వ్యక్తి (రాజమౌళి) ఏమి చేయగలడో నాకు తెలుసు, బాహుబలి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. బాహుబలితో తెలుగు సినిమాని అందంగా కీర్తించింది.
ప్రస్తుతం అందరూ మాట్లాడుతున్న పాన్ ఇండియా ట్రిపుల్ ఆర్ విషయం పై తన అభిప్రాయం తెలుపుతూ.. రోజా, బాంబే మరియు దిల్ సే అన్నీ పాన్-ఇండియన్ సినిమాలే. ఇది మనం ఒకరి నుండి మరొకరు ఏమి నేర్చుకోగలము అనే దాని గురించి మరింత ఎక్కువ నేర్పిస్తుంది. రహమాన్ ఈ మధ్యకాలంలో మణిరత్నం చిత్రం పొన్నియిన్ సెల్వం చిత్రానికి స్వరాలని అందించాడు. చోళ సామ్రాజ్యం విశిష్టతని, ఘాన ఖ్యాతిని రూపొందిస్తూ ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు.