కలక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు టాలీవుడ్ ని ఏలాలని విశ్వప్రయత్నాలు చేసాడు. కానీ తన వల్ల కాక చేతులెత్తేశాడు. వరుస పరాజయాలతో తల బొప్పికట్టిన తర్వాత, కరోనా సమయం కూడా కాటేయడంతో కొన్నేళ్లు ఖాళీగా ఉన్నాడు. తర్వాత మా ఎన్నికలలో, పరభాషా నటుడని అంశాన్ని లేవనెత్తుకుని, చిరంజీవి సమర్థించిన ప్రకాష్ రాజ్ పై అనూహ్య పరిణామాల నేపథ్యంలో విజయం సాధించాడు.
ఆ తర్వాత, తనపై తనకే నమ్మకం పెరిగి జిన్నా అనే చిత్రంతో ఈ దీపావళి సందర్భంగా అలరించడానికి సిద్ధమయ్యాడు. తన చిత్రాన్ని ప్రచారం చేసుకోకుండా, వివాదాస్పద ప్రకటలనతో కాలక్షేపం చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పాత్రికేయులతో మాట్లాడుతూ.. తనని, తన కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలుచేసేందుకే, ఒక అగ్ర నటుడు, బంజారా హిల్స్ లో ఒక సాఫ్ట్ వేర్ సంస్థని నెలకొల్పాడని, ఆ వివరాలన్నీ తన బృందం కనుక్కుని, సైబర్ సెల్ కి ఫిర్యాదు చేసిందని వివరించాడు.
మరికొన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పడంతో మంచు విష్ణు తదుపరి సమావేశంపై ఆసక్తి నెలకొంది. కానీ మంచు విష్ణు పాత పాటే పాడరా అన్న చందాన, ఆ అగ్ర నటుడు అందరికి తెలుసని చెప్పాడు కానీ, అగ్ర నటుని పేరు మాత్రం బయటపెట్టలేదు. దానిని బట్టి తెలిసేదేమిటంటే, అందరికీ ఆ అగ్రనటుడి పేరు తెలుసుకానీ, మంచు విష్ణుకి తెలీదు. మంచు విష్ణుకి ముసుగులో గుద్దలాట తప్ప, ధైర్యంగా పేర్లు వెల్లడించే దమ్ములేదు. తమపై ఆరోపణలు చేసే వారిని మాత్రం, సాక్ష్యాలు కావాలని గద్దిస్తారు కానీ, తాము మాత్రం అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ నాటకాలు ఆడుతారు.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.