నిన్నమొన్నటివరకు తారక్ ఫాన్స్ ఆందోళనతోనే ఉన్నారు. కారణం ఆయన ట్రిపుల్ ఆర్ తర్వాత ఇన్ని నెలలపాటు కొత్త సినిమా కోసం బ్రేక్ తీసుకోవడం ఒకటైతే.. రెండోది ఆయన లుక్. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత బరువు పెరిగినట్టుగా కనిపించడం, కాస్త వెయిట్ తగ్గినా.. ఫేస్ లో ఇంకా బరువైన ఛాయలు కనిపించడంతో తారక్ ఫాన్స్ ఆయన తదుపరి సినిమాలో లుక్ పై గుబులు పడుతున్నారు. కానీ ఇప్పుడు తారక్ ఫాన్స్ మనసునిండా గాలిపీల్చుకుని కూల్ గా రిలాక్స్ అవుతున్నారు. కారణం ఎన్టీఆర్ కొత్త లుక్.
మొన్న ఎయిర్ పోర్ట్ లో జపాన్ వెళుతూ స్టైలిష్ గా సన్నగా కనిపించిన తారక్ నేడు.. జపాన్ మీడియా ముందు సింపుల్ గా, కూల్ గా, డీసెంట్ లుక్ లో దర్శనమివ్వడం, అలాగే ఆయన వెయిట్ తగ్గిపోయి స్లిమ్ గా కనిపించడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొందరైతే ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో, ఆలోచిస్తూ, ఆందోళన పడుతూ.. బరువు పెరిగిపోతున్నారు, చాలారోజుల తర్వాత ఆయన బయట ఎలా కనిపిస్తారో అనే ఆందోళనలో ఉన్న టైం లో.. ఎన్టీఆర్ ఇలా స్లిమ్ అవతార్ లో కనిపించడం, జపాన్ మీడియా ముందు రాజమౌళి, రామ్ చరణ్ తో హుషారుగా కనిపించడంతో తారక్ ఫాన్స్ కూల్ అవుతన్నారు. ఎన్టీఆర్ జపాన్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడం.. వాటిని షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. దీనితో NTR30 ఎప్పుడు మొదలవుతుందో అనే దిగులు కాస్త తగ్గింది వారిలో.