బిగ్ బాస్ సీజన్ 6 చాలా చప్పగా మొదలయ్యింది. రేవంత్-గీతు-శ్రీహన్ ఇలా కొంతమంది తప్ప బిగ్ బాస్ లో ఉండేందుకు అర్హులు కానివారు చాలామంది ఉన్నారు. వాసంతి, కీర్తి, రాజ్, అర్జున్ ఇలా చాలామందికి బిగ్ బాస్ గురించి తెలియదు. అందుకే బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్ పై మండిపడుతున్నాడు. గత రెండురోజులుగా హౌస్ మేట్స్ పై బిగ్ బాస్ గుర్రుగా ఉండి ఫుడ్ ఎత్తుకుపోయారు. ఫుడ్ కావాలంటే కష్టపడి టాస్క్ ఆడాల్సిందే అనే రూల్ పెట్టాడు. ఇక ఈ వారం ఇనాయని సూర్య తో ఫ్రెండ్ షిప్ డిస్టర్బ్ చెయ్యడంతో ఆమె లోన్లీగా ఫీలవుతూ తన ఎనిమి శ్రీహన్ దగ్గరకి వెళ్లి గత వారం అనవరసంగా నిన్ను నామినేట్ చేశా.. కోపంతో చేశా, అందరికన్నా హౌస్ లో నువ్వే బెటర్ అనడంతో శ్రీహన్ అందరి దగ్గరికి వెళ్లి తనని ఇనాయ పొగిడిన విషయం చెప్పుకున్నాడు.
ఇక శ్రీహన్ బర్త్ డే కి హౌస్ మేట్స్ కేక్ చెయ్యగా.. ఇనాయ దాని మీద హార్ట్ సింబల్ వేసి చోటు అని రాయడంతో రేవంత్, శ్రీసత్య, వాసంతి శ్రీహన్ ని ఆటపట్టించారు. శ్రీహన్ కూడా ఇనాయకి కేక్ తినిపించడంతో హౌస్ మేట్స్ అంతా గోల గోల చేసారు. తర్వాత బిగ్ బాస్ ఇప్పటివరకు ఫుడ్ కోసం పోరాడారు. ఇప్పటినుండి హౌస్ లో ఉండేందుకు పోరాడండి అని టాస్క్ ఇవ్వగా.. అందులో రేవంత్ vs అర్జున్, అర్జున్ vs శ్రీహన్ అన్న రేంజ్ లో గొడవలు జరిగినట్టుగా ప్రోమో వదిలారు.