యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓరి దేవుడా ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ స్పెషల్ కేరెక్టర్ లో కనిపించబోతున్న ఓరి దేవుడా మూవీ రేపు శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న తరుణంలో టీం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది. ప్రతి సినిమాకి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కునే విశ్వక్ సేన్.. మొదటిసారి కూల్ గా సినిమాని ప్రమోట్ చేసి ఆడియన్స్ ముందుకు వస్తున్నట్టుగా చెప్పి కామెడీ పండిస్తున్నాడు.
అయితే విశ్వక్ సేన్ ప్రమోషన్స్ లో భాగంగా జబర్దస్త్ రామ్ ప్రసాద్ ప్రేక్షకుల ప్రశ్నలని విశ్వక్ సేన్ కి చదివి వినిపించి ఆన్సర్స్ ఇమ్మన్నారు. రామ్ ప్రసాద్ ఆ ప్రశ్నలు చదువుతూ.. మీరు ఎన్టీఆర్ కి డై హార్డ్ ఫ్యాన్ కదా.. ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా అని అడగ్గానే.. విశ్వక్ సేన్ ఇమ్మిడియట్ గా.. చేస్తాను అంటి చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ముచ్చటపడుతున్నాడు. ఎన్టీఆర్ సినిమాలో విశ్వక్ సేన్ కి విలన్ ఛాన్స్ ఇవ్వండి బాస్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అదలా ఉంటే.. ఇలా ఎన్టీఆర్ ఫాన్స్ ని విశ్వక్ సేన్ పర్ఫెక్ట్ టైం లో బుట్టలో పడేసాడని కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.