జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి కామెడీ డైరెక్టర్ గా పరిచయమైన అనుదీప్ ఇప్పుడు ప్రిన్స్ మూవీ తో తెలుగు, తమిళ్ లో అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. నవీన్ పోలిశెట్టి-రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శిలతో ఫన్ జనరేట్ చేస్తూ జాతి రత్నాలని భారీ ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ ని మెప్పించిన అనుదీప్ ప్రిన్స్ తో మళ్లీ అంత హిట్ కొట్టడం సాధ్యమేనా అంటున్నారు నిపుణులు. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ప్రిన్స్ రేపు శుక్రవారం విడుదల కాబోతుంది.
అయితే జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ మూవీతో అనుదీప్ వస్తున్నప్పటికీ.. ఎందుకో ప్రిన్స్ మూవీకి అంతగా బజ్ క్రియేట్ కావడం లేదు. ప్రిన్స్ ట్రైలర్ చూసి ప్రేక్షకులు పెదవి విరిచేసారు. అనుదీప్ ప్రిన్స్ తో అంత అట్రాక్ట్ చెయ్యడం కష్టమే అంటున్నారు. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో సపోర్ట్ ఉన్నప్పటికీ.. ప్రిన్స్ బుకింగ్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరోపక్క ఓరి దేవుడా, కార్తీ సర్ధార్ తో పోటీకి దిగింది ప్రిన్స్. తెలుగులో ఓరి దేవుడా ప్రిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంటే.. తమిళంలో సర్దార్ ప్రిన్స్ కి గుదిబండలా అడ్డం పడుతుంది. మరి ప్రిన్స్ తో జాతిరత్నానికి కష్టహే.. చూద్దాం అనుదీప్ లక్ ఎలా ఉందో.. అనేది.