యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ అభిమానులలో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కీర్తిని ఆర్జించి, అశేష భారతావనిలో అభిమానులను స్వంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలు సలార్, అది పురుష,ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నాడు.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, ఆదిపురుష్ నిర్మాతలు ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 న ఆ చిత్రం నుండి మొదటి పాటని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టీజర్ కి విశేష స్పందన వచ్చింది. మొదటి సారి చూసినప్పుడు, పెదవి విరిచిన వారే, థియేటర్లో చూసి అద్భుతం అని పొగుడుతున్నారు.
అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రం నుండి కూడా ఆసక్తికరమైన అప్డేట్స్ వస్తాయని తెసులుస్తోంది. సలార్ టీజర్ కానీ, ప్రభాస్ సలార్ గ్లింప్స్ కానీ విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. అవి కాకుండా ప్రభాస్-మారుతీ చిత్ర నిర్మాతలు కూడా అభిమానులని అలరించడానికి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అభిమానులు ప్రాజెక్ట్ కే, మరియు స్పిరిట్ చిత్రాల నుండి కూడా ఆసక్తికరమైన సంచలనాలను ఆశించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు సంబరాలను ప్రారంభించేసారు. అతని చిత్రం బిల్లా ని 4K హెచ్ డి ప్రింట్ లో విడుదలకి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక ప్రభాస్ చిత్ర దర్శక నిర్మాతలనుండి అదిరిపోయే కానుకల కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.