Advertisementt

‘చరణ్-అర్జున్’ డైరెక్టర్ ఎవరంటే..

Mon 24th Oct 2022 11:26 AM
trivikram srinivas,director,ram charan,allu arjun,combo film,  ‘చరణ్-అర్జున్’ డైరెక్టర్ ఎవరంటే..
He is the Allu Aravind Dream Movie Charan Arjun Director ‘చరణ్-అర్జున్’ డైరెక్టర్ ఎవరంటే..
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్ అలీతో సరదాగా టాక్ షో లో రామ్ చరణ్-అల్లు అర్జున్‌తో మల్టీస్టారర్ మూవీ చేయడమే నా కల అని.. ఆయన చేసిన కామెంట్స్ మంగళవారం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరణ్-అర్జున్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి పదేళ్లుగా దానిని రెన్యువల్ చేయిస్తున్నాను.. కథ, అలాగే దానికి తగ్గ దర్శకుడు తగలగానే ఆ సినిమా పట్టాలెక్కుతోంది అని చెప్పి అందరిలో ఆసక్తిని క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తుంది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘కరణ్-అర్జున్’ మూవీకి చరణ్-అర్జున్ రీమేక్ అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకి దర్శకుడు ఎవరో, అరవింద్ మనసులో ఏ దర్శకుడు ఉన్నాడో అనేది కూడా తెలిసిపోయింది.

 

ఆయనెవరో కాదు అల్లు అర్జున్‌కి మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. రామ్ చరణ్-అల్లు అర్జున్ కలయికలో రాబోయే చరణ్-అర్జున్ మూవీకి డైరెక్టర్ అని తెలుస్తుంది. అల్లు అర్జున్‌తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చేసిన త్రివిక్రమ్‌కి రామ్ చరణ్‌తో మాత్రం ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది. మరి చరణ్-అర్జున్‌తో త్రివిక్రమ్ చెయ్యబోయే మూవీ ఎలా ఉంటుందో అనేది ఇప్పటినుండే ఆడియన్స్‌లో ఆత్రుత మొదలైపోయింది. 

He is the Allu Aravind Dream Movie Charan Arjun Director:

Trivikram Srinivas will Directs Ram Charan and Allu Arjun combo film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ