ఈ వారం బాక్సాఫీసు వద్దే కాదు ఓటిటిలోను ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. అయితే థియేటర్స్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. ముఖ్యంగా ఈ శుక్రవారం నాలుగు సినిమాల మధ్యనే ఇంట్రెస్టింగ్ ఫైట్ కనబడుతుంది. అందులో విశ్వక్ సేన్ ఓరి దేవుడా మూవీ, మంచు విష్ణు జిన్నా మూవీ, అలాగే తమిళం నుండి కార్తీ సర్దార్ డబ్బింగ్ మూవీ తో పాటుగా.. డైరెక్టర్ అనుదీప్ తెలుగు, తమిళంలో డైరెక్ట్ చేసిన ప్రిన్స్ మధ్యనే బాక్సాఫీస్ ఫైట్ జరగబోతుంది. అయితే విశ్వక్ సేన్ ఓరి దేవుడా మూవీ మలయాళం రీమేక్ అయినా.. ఇక్కడ సీనియర్ హీరో వెంకీ నటించడం, అలాగే ఆ సినిమాకి చేస్తున్న ప్రమోషన్స్ అన్ని సినిమాపై ఆసక్తిని కలుగజేస్తున్నాయి.
ఇక మంచు విష్ణు జిన్నా ప్రమోషన్స్ తో సినిమాపై క్యూరియాసిటీని కలగజేస్తున్నారు. మరోపక్క కార్తీ సర్దార్ అన్నిటికన్నా ఎక్కువ అంచనాలతో థియేటర్స్ లోకి రాబోతుంది. అనుదీప్ - శివ కార్తికేయన్ కలిసి చేసిన ప్రిన్స్ మూవీకి విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ సపోర్ట్ చెయ్యడంతో సినిమా చూడాలనే ఆసక్తి అందరిలో మొదలయ్యింది. మరి ఈ వారం ముఖ్యంగా ఈ నాలుగు సినిమాల మధ్యనే టఫ్ ఫైట్ ఉండబోతుంది. వీటి తో పాటుగా ఓటిటీలలోను బింబిసార-ఒకే ఒక జీవితం-కృష్ణ వ్రింద విహారి ల మధ్యన ఆసక్తికరమైన పోటీ నెలకొంది.