Advertisementt

చరణ్ ఓకె.. ఎన్టీఆర్ కోసం వెయిటింగ్

Wed 19th Oct 2022 09:42 AM
ram charan,upasana,japanese street food  చరణ్ ఓకె.. ఎన్టీఆర్ కోసం వెయిటింగ్
Charan enjoys Japanese street food చరణ్ ఓకె.. ఎన్టీఆర్ కోసం వెయిటింగ్
Advertisement
Ads by CJ

నిన్న మంగళవారం రామ్ చరణ్ తన వైఫ్ ఉపాసనతో కలిసి జపాన్ ఫ్లైట్ ఎక్కాడు. జపాన్ లో ఈనెల 21 న రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం చరణ్ వైఫ్ తో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి జపాన్ కి బయలు దేరివెళ్లాడు. ఆ తర్వాత సాయంత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భార్య ప్రణతి పిల్లలతో జపాన్ బయలు దేరాడు. చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడం, అలాగే ఆయన లుక్ కి ఎన్టీఆర్ ఫాన్స్ బాగా ఇంప్రెస్స్ అయ్యారు. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ కాస్త లావుగా, వెయిట్ పెరిగిపోవడం ఫాన్స్ ని ఆందోళనలో పడేసాడు.

కానీ తాజాగా ఎన్టీఆర్ లుక్ చూసిన ఫాన్స్ సంతోషపడిపోయారు. ఇక జపాన్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ అండ్ ఉపాసనలు అక్కడి స్ట్రీట్ ఫుడ్ ని ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్రెండ్స్‌తో కలిసి ఒక హోటల్‌లో చరణ్ అండ్ ఉపాసనలు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చరణ్ పిక్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ చరణ్ ఓకె కానీ, మాకు ఎన్టీఆర్ పిక్స్ కావాలి అని అడుగుతున్నారు.  ఎందుకంటే ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో చాలా లో ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తాడు. అక్కడ ప్రణతి, పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అనేది ఏదైనా పిక్స్ లో కనిపిస్తాయేమో అని వారి ఇంట్రెస్ట్. అందుకే చరణ్ ఓకె.. ఎన్టీఆర్ కోసం వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Charan enjoys Japanese street food:

Ram Charan with his wife enjoys Japanese street food

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ