అధికారంలోకి రావటానికి అమాయకులైన అమరావతి రైతులని జగన్ ఎన్నికల్లో నమ్మబలికి ఆ తర్వాత వారిని బలిపీఠం పైకి ఎక్కించడానికి సిద్ధమయ్యాడు. కులం పేరుతో రాజకీయాల్ని చేసి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమ పబ్బం గడుపుకోసాగాడు.
అన్ని ప్రాంతాలలో భూములని అక్రమించుకోడానికి పథకాలు రచించసాడాడు. రాజకీయనేతల ముసుగులో గూండాలను పంపి అన్ని ప్రాంత ప్రజలను భయభ్రాంతులను చేయసాగారు. అమరావతి రైతులు న్యాయబద్ధంగా, శాంతియుతంగా పోరాటాలు మరియు పాదయాత్రలు చేస్తుంటే, జగన్ తన అధికారయంత్రాంగంతో, అసలు విషయాన్ని ప్రక్కత్రోవ పట్టిస్తూ, కోర్టులను ధిక్కరిస్తూ, అమరావతి రైతుల పై దండయాత్రలు ని కొనసాగిస్తున్నాడు.
కోర్టులు మొట్టికాయలు కొట్టినప్పుడల్లా, తోకముడిచి ముంగిలా ఉంటూ, కొన్నిరోజుల తర్వాత మళ్ళీ తాచుపాములా బుసలు కొడుతున్నాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ, ఎవరూ తనని చూడలేదనుకుంటున్న చందాన, జగన్ కోర్టులు తనని గమనించలేదనుకుంటున్నాడు. మరి కొన్ని రోజులలో జగన్ కోర్టులనుంచి మరిన్ని మొట్టికాయలు తినటం ఖాయం. అయినా కుక్క తోక వంకర అన్నట్టుగా, జగన్ మారడు. కనకపు సింహాసనము పైన శునకము కూర్చుండబెట్టిన, ఇలానే అవుతుంది. జగన్ పాపం పండే రోజులు దగ్గర్లో ఉన్నాయి. ఆరిపోయే దీపం ఎగిరెగిరి పడుతుందన్న మాట జగన్ విషయంలో నిజమవుతోంది. ఎన్నికల్లో వాగ్దనాలని అమలు పర్చే విషయంలో మాట మడతెత్తడం, మడమతిప్పటం చేసే జగన్, ప్రజలని అణచివేయడంలో మాట తప్పడు, మడమ తిప్పడు.