Advertisementt

మహేష్-రాజమౌళి కాంబో నేపథ్యం అదేనా..

Tue 18th Oct 2022 06:03 PM
deepika padukone,mahesh,rajamouli  మహేష్-రాజమౌళి కాంబో నేపథ్యం అదేనా..
Interesting News About Mahesh-Rajamouli Film మహేష్-రాజమౌళి కాంబో నేపథ్యం అదేనా..
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తో అందరినీ అలరించిన తర్వాత, తన తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ చిత్రం మొదటి షెడ్యూల్ దసరా ముందర ముగించారు. ప్రస్తుతం దర్శక నిర్మాతలు రెండవ షెడ్యూల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు ఈ చిత్రంలో పూజ హెగ్డే తో సరసమాడనున్నాడు.

అభిమానుల ఆసక్తి  అంతా మహేష్ బాబు-రాజమౌళి చిత్రంపైనే ఉంది. రాజమౌళి రోజు రోజుకీ  తన మాటలతో ఆ చిత్రం పై ఉత్సుకతను అంతకంతకూ పెంచేస్తున్నాడు. ఈ మధ్యనే అమెరికా లో ఆర్.ఆర్. ఆర్ చిత్ర ప్రదర్శన తర్వాత అక్కడి సినీ ప్రియులు మరియు పాత్రికేయులతో మాట్లాడుతూ, మహేష్ బాబు చిత్రం కధ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాడు.

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, రాజమౌళి మహేష్ బాబు చిత్రం కోసం యధార్థ సంఘటలనలు స్ఫూర్తిగా తీసుకొన్నారని. ఆ స్పూర్తితో, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సహాయంతో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఆసక్తికరమైన కథని తయారు చేసాడని తెలుస్తోంది. చిత్ర నిర్మాతలు, ఈ చిత్రంకోసం బాలీవుడ్ అందగత్తె దీపికా పడుకొనే ని నాయికగా తీసుకోవాలని యోచిస్తున్నారు. దీపిక అంగీకారం తెలిపితే, తెలుగులో ఆమెకిది రెండవ చిత్రం అవుతుంది. దీపికా పడుకొనే ప్రస్తుతం ప్రభాస్ స్సై ఫై చిత్రం ప్రాజెక్ట్ కే లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం చేస్తున్నాడు.

Interesting News About Mahesh-Rajamouli Film:

Deepika Padukone in Mahesh, Rajamouli Film ?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ