బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ మేట్స్ కొట్లాటలు, గొడవలు, ఫన్ మధ్యన నిన్నమొన్నటివరకు ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం, ఆ మసాలా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ హౌస్ లో మిస్ అవడంతో వీక్ డేస్ లో బిగ్ బాస్ కి మరీ దారుణమైన టీఆర్పీ రావడం బిగ్ బాస్ యాజమాన్యానికి మింగుడు పడడం లేదు. వీకెండ్ నాగార్జున ఎపిసోడ్స్ కూడా అంతంతమాత్రమైన టీఆర్పీ తెచ్చుకుంటున్నాయి. హౌస్ మేట్స్ మరీ డల్ గా నిస్సారంగా టాస్క్ ఆడుతున్నారు. ఈరోజు మంగళవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ అంతా సెలెబ్రిటీ గేమింగ్ లీగ్ ఆడారు. పుష్ప థీమ్, అలాగే మరికొన్ని గెటప్స్ తో ఎంటర్టైన్ చెయ్యాల్సి ఉండగా..ఎవరి పాత్రల్లో వాళ్ళు గెటప్స్ మార్చేసి మరీ కామెడీకి దిగారు.
ఒకొనొక టైం లో హౌస్ మేట్స్ అంతా బెడ్ రూమ్ లో మీటింగ్ పెట్టారు. అలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర, బయట సోఫాలో, లివింగ్ ఏరియాల్లో ఇలా ఎవరికి వారే ముచ్చట్లు పెట్టడంతో.. మండిన బిగ్ బాస్.. హౌస్ మేట్స్ అంతా గార్డెన్ ఏరియా లోకి వచ్చి వరసగా నించోమని చెప్పాడు. అందరూ వచ్చి నిలబడగానే.. ఈ షో పట్ల మీకు ఆసక్తి లేదని నమ్మిట్లయితే.. మీరు తక్షణమే బిగ్ బాస్ ముఖ్య ద్వారం నుండి బిగ్ బాస్ ఇంటిని వదిలి బయటికి వెళ్ళవచ్చు అనగానే హౌస్ మేట్స్ మొహాలు మాడిపోయాయి. అసలు బిగ్ బాస్ హౌస్ మేట్స్ పట్ల అంత హర్ష్ గా ఎందుకు మాట్లాడాడో అనేది ఈ రోజు నైట్ ఎపిసోడ్ లో రివీలవుతుంది.