గత రాత్రి బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారానికి గాను నామినేట్ చేసిన ఇంటి సభ్యులు సరైన కారణాలు చెప్పలేక చేతులెత్తేశారు. సిల్లీ రీజన్స్ తో ఎదుటి వారిని నామినేషన్స్ లోకి పంపించారు. రేవంత్ ని అయితే కేవలం కెప్టెన్ గా నిద్రపోయాడన్న ఒకే ఒక్క కారణంతో హౌస్ మేట్స్ టార్గెట్ చేసారు. అతను ఎంతగా సారి చెప్పినా మిగతా హౌస్ మేట్స్ రేవంత్ నే నామినేట్ చెయ్యడం విచిత్రంగాను, చిరాకుగాను అనిపించింది. ఇక బాలాదిత్యని అంతే.. కేవలం అతను వేరేవాళ్లకి హెల్ప్ చేసాడని అతన్ని నామినేట్ చేసారు.
ఇక ఇనాయ అయితే శ్రీహన్ విషయం లో ఏం చేస్తుందో.. ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. మిగతా వాళ్ళు కూడా నామినేషన్స్ లో బలమైన కారణం చెప్పకుండా సిల్లీ రీజన్స్ తో నామినేట్ చెయ్యడం చూసిన వారు.. అదేమిట్రా బాబు ఎలాంటి రీసన్స్ లేకుండా ఏ నామినేషన్స్ ఏంట్రా బాబు అంటూ తలపట్టుకుంటున్నారు. గొడవలు కూడా పెద్దగా జరక్కుండానే ఈ నామినేషన్స్ ప్రక్రియ ఏడో వారానికి ముగిసింది. ఇక రేవంత్ ఎన్నిసార్లు బురదనీళ్ళు పోసుకున్నా కామ్ గా ఉండి చివరిలో షర్ట్ విప్పేసి తగ్గేదేలే అంటూ బురదతో బయటికివచ్చి అందరిని ఇంప్రెస్స్ చేసారు. ఈ వారం హౌస్ నుండి 13 మంది నామినేషన్స్ కి వెళ్లారు. కేవలం గీతు, కెప్టెన్ సూర్య తప్ప.