మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న SSMB28 షూటింగ్ గత నెలలో మొదలయ్యింది. వారం రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ ముగించేసిన మహేష్-త్రివిక్రమ్ సెకండ్ షెడ్యూల్ ఈ నెల 10 న కానీ 12 న కానీ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ మధ్యలో మహేష్ బాబు అమ్మగారు కాలం చెయ్యడంతో సెకండ్ షెడ్యూల్ కాస్త డిస్టబెన్స్ అయ్యింది. తర్వాత మహేష్ బాబు ఓ యాడ్ షూట్ లో పాల్గొనగా.. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సెకండ్ షెడ్యూల్ ఈనెలలో కాదని, వచ్చేనెల అంటే నవంబర్ మొదటి వారంలో మొదలు పెడతారని తెలుస్తుంది. నవంబర్ మొదటి వారంలో సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టి నిరవధికంగా షూటింగ్ చిత్రీకరణ చేపడతారట త్రివిక్రమ్. అయితే ప్రస్తుతం మహేష్ బాబు విదేశాలకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది.
ఇక SSMB28 పై రకరకాల ఊహాగానాలు, అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అది మహేష్ లుక్ పై మహేష్ డిస్పాయింట్ అయ్యారని, అందుకే ఫస్ట్ షెడ్యూల్ త్వరగా లేపేసారని అంటున్నారు. ఇప్పుడేమో మహేష్-త్రివిక్రమ్ SSMB28 కథ మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారు.. అందుకే సెకండ్ షెడ్యూల్ లేట్ అయ్యింది అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే మరోసారి జోడి కడుతుంది. ఇంకా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉంటుంది అని, అలాగే మరో పర భాషా హీరో కూడా SSMB28 లో భాగమయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.