రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోన్న కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కాంతార’. ఈ సినిమా కన్నడలో కంటే కూడా తెలుగులో భారీగా కలెక్షన్లను రాబడుతుండటం విశేషం. విడుదలైన మొదటి రోజు నుంచే లాభాల బాటలో నడుస్తున్న ఈ చిత్రం.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీగా మారింది. ఒక్క తెలుగు అనే కాదు.. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది మరి. ఈ సినిమా విజయంతో.. అంతా మరోసారి కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ కరెక్ట్‌గా పడితే.. అద్భుతాలు సృష్టించవచ్చని.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నమాట. అయితే ఇది అవడానికి కన్నడ చిత్రమే అయినా.. ఇందులో మన తెలుగు చరిత్ర ఉందనే విషయం తెలుసా?
ముఖ్యంగా ఇది సమ్మక్క సారక్కల కథ అని చాలా మందికి తెలియదు. వారు కూడా అడవి కోసం, అడవిలో జీవించే వారి కోసం కాకతీయులతో పోరాడి.. చిలకలగుట్ట కొండపై అదృశ్యం అయ్యారనేది చరిత్ర చెబుతున్న కథ. సేమ్ టు సేమ్ అలాంటి కథకే.. కోలం యాడ్ చేసి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రాజులు, దేవుడు కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా.. ఇలాంటి సహజమైన కథలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది. సెర్చ్ చేస్తే.. ఇలాంటి కథలు తెలుగు రాష్ట్రాల్లో కూడా బోలెడన్ని దొరుకుతాయి. మరి ఆ దిశగా తెలుగు దర్శకులెవరైనా ప్రయత్నిస్తారేమో చూద్దాం.