ఈమధ్యన గ్లామర్ గా షాక్ ల మీద షాకులు ఇస్తున్న రష్మిక మందన్న తన అందాన్ని పెంచుకోవడానికి నిత్యం జిమ్ లోనే గడుపుతుంది. షూటింగ్ అయ్యాక అయినా, లేదంటే ఉదయమైనా రష్మిక జిమ్ చెయ్యాల్సిందే. అందుకే అంత ఫిట్ గా గ్లామర్ ని మెయింటింగ్ చేస్తుంది. ఈమధ్యన మాల్దీవులకు వెళ్లి కాస్త రిఫ్రెష్ అయిన రష్మిక అక్కడినుండి వచ్చి రాగానే.. మ్యాగజైన్ ఫోటో షూట్ అంటూ మోత మోగించేసింది. అసలు రష్మిక చేస్తున్న గ్లామర్ షో చూస్తే బాలీవుడ్ భామలకు మతిపోతుంది. లక్కీ గర్ల్ కాస్తా గ్లామర్ గర్ల్ గా టర్న్ అయ్యింది.
తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలతో స్టార అవకాశాలతో ఫుల్ బిజీ తారగా మారిన రష్మిక తాజాగా సోషల్ మీడియాలో జిమ్ వీడియో ని షేర్ చేసింది. Sweating my worries out! 💪🏼🥲 అని క్యాప్షన్ పెట్టిన ఆ వీడియో లో రష్మిక కష్టపడి, చమటలు కక్కుతూ జిమ్ చేస్తూ బరువు తగ్గించుకుని అందాన్ని పెంచుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ కి హాజరవుతూనే.. పుష్ప ద రూల్ పాన్ ఇండియా రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది.
Sweating my worries out! 💪🏼🥲 https://t.co/Hmw3pEGW82
— Rashmika Mandanna (@iamRashmika) October 17, 2022